Turmeric: పురుషులు పసుపు తింటే ఇలా జరుగుతుందా!

పసుపు వినియోగం పురుషులకు ఎంతో ప్రయోజనకరమని సూచిస్తున్నారు నిపుణులు. పసుపు పురుషులలో లైంగిక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలోని పోషకాలు పురుషులు వీర్యకణాల నాణ్యతను పెంచుతాయట.

author-image
By Archana
New Update
turmeric benefits

turmeric benefits

Turmeric benefits: ఆయుర్వేదంలో పసుపుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆయుర్వేదంలో పసుపుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా పురుషులు పసుపును తీసుకోవడం ద్వారా  అనేక లైంగిక సమస్యలను అధిగమించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

లైంగిక సమస్యలు

  • పసుపు పురుషులకు లైంగిక సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. వయసు పెరగడం, అలసట ఒత్తిడి కారణంగా పురుషుల్లో లిబిడో సెక్స్ డ్రైవ్ ) తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పసుపు తీసుకోవడం ద్వారా లిబిడో (సెక్స్ డ్రైవ్)పెరుగుతుంది. 
  • చెడు జీవశైలి విధానాలు, అనారోగ్యపు ఆహరపు అలవాట్ల కారణంగా  ఈ రోజుల్లో  పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు చాలా వేగంగా తగ్గుతున్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం..   పసుపు తీసుకోవడం ద్వారా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. 

Also Read: Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!

  • పసుపు కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలసట, బలహీనత వంటి సమస్యలను తగ్గిస్తుంది.
  • పసుపులోని గుణాలు పురుషులు వీర్యకణాల నాణ్యతను పెంచుతాయని చెబుతారు. ఆయుర్వేదం ప్రకారం..  వీర్యం సన్నబడటం వల్ల ఇబ్బంది పడే వారు రొజూ ఉదయాన్నే పసుపు, తేనె మిశ్రమాన్ని సమాన మోతాదులో తీసుకోవడం వల్ల లైంగిక శక్తి కూడా పెరుగుతుంది.
  • పసుపులోని పోషకాలను శరీరానికి అందించడానికి ప్రతిరోజు కూరగాయాల్లో కలిపి తీసుకోవచ్చు. అలాగే  రాత్రి పడుకునే ముందు పసుపు పాలను తాగవచ్చు. 
  • పసుపులోని కుర్కుమిన్ వాపు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను తగ్గిస్తుంది. పసుపుతో నల్ల మిరియాల  పొడిని కలిపి తీసుకోవడం వల్ల కూడా  చాలా ప్రయోజనం ఉంటుంది.

గమనిక: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు, సూచనల కోసం పండితులను సంప్రదించగలరు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు