Green Tea: సాధారణంగా గ్రీన్ టీతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీ జీర్ణ వ్యవస్థ మెరుపరచడంతో పాటు బరువు తగ్గడంలోనూ సహాయ పడుతుంది. కానీ దీని ఆస్ట్రింజెంట్ రుచి కారణంగా చాలా మంది గ్రీన్ టీని తాగడానికి ఇష్టపడరు. అయితే గ్రీన్ టీలో కొన్ని పదార్థాలు కలపడం ద్వారా దాని రుచి కాస్త మెరుగుపరుచవచ్చు . దీనివల్ల టీ రుచిగా మారుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ రుచిని పెంచే పదార్థలు
నిమ్మరసం:
- చాలా మంది గ్రీన్ టీ రుచిని పెంచడానికి నిమ్మరసం కలుపుతుంటారు. ఇది రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నిమ్మరసం శరీరంలో యాంటీ యాక్సిడెంట్లను పెంచుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
Also Read: Sleep: పగటి పూట నిద్ర పొతే మీ బతుకు బస్టాండ్ అవుతుందా? ఇందులో నిజమెంత?
ఎర్ర ద్రాక్షను:
- గ్రీన్ టీని తయారు చేసేముందు, ఒక ఎర్ర ద్రాక్షను నీటిలో వేసి బాగా మరిగించి.. ఆ తర్వాత అందులో గ్రీన్ టీ బ్యాగ్ వేయండి. ద్రాక్ష లోని తీపి, పులుపు గ్రీన్ టీలోని ఆస్ట్రింజెన్సీని ఫ్లేవర్ ను తగ్గిస్తాయి.
గ్రీన్ టీలో ఆపిల్ సిడార్ వెనిగర్:
- ఆపిల్ సిడార్ వెనిగర్ రుచి కొద్దిగా పుల్లగా, తీయగా ఉంటుంది. దీనిని గ్రీన్ టీలో కలపడం ద్వారా దాని ఆస్ట్రింజెన్సీని రుచిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక కప్పు టీలో ఒక ఒక టీస్పూన్ ఆపిల్ సిడార్ వెనిగర్ వేసి తాగండి. యాపిల్ సిడార్ రుచిని పెంచడమే కాకుండా బరువు తగ్గించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. చాలా మంది బరువు తగ్గడానికి ఆపిల్ సిడార్ వెనిగర్ వాడుతుంటారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Life Style: దేవుడి విగ్రహం విరిగిపోవడం చెడుకు సంకేతమా? విరిగిపోతే ఏం చేయాలి