/rtv/media/media_files/2025/05/28/pCIcOJtdAOBcR0QZS8HA.jpg)
short circuit
Life Style: షార్ట్ సర్క్యూట్ అనేది విద్యుత్ సరఫరాలో సమస్య కారణంగా అకస్మాత్తుగా జరిగే ప్రమాదకర ఘటన. దీని వల్ల మంటలు చెలరేగడం, ఆస్తి నష్టం లేదా ప్రాణహానీ కూడా కలగవచ్చు. ఇటీవలే హైదరాబాద్ చార్మినార్ గుల్జార్ హౌస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నివారణ చర్యలు
నాణ్యమైన వైర్లు, పరికరాలు
చాలా వరకు జరిగే షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు నకిలీ లేదా నాణ్యత లేని విద్యుత్ పరికరాల వల్ల జరుగుతున్నాయి. కావున ISI మార్కు ఉన్న ఎలక్ట్రిక్ పరికరాలను మాత్రమే వాడండి.
ఓవర్‌లోడ్‌కు తగిన మినీ సర్క్యూట్ బ్రేకర్ (MCB)
ఒక్కే ప్లగ్‌లో ఎక్కువ పరికరాలు పెట్టడం కూడా షార్ట్ సర్క్యూట్ కి దారితీసే ప్రమాదం ఉంది. అవసరమైన చోట MCBలు అమర్చడం వల్ల షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
వైరింగ్‌ను తనిఖీ
కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన పాత ఇండ్లు అయితే, అక్కడి విద్యుత్ వైర్లను ఎలక్ట్రిషియన్ ద్వారా చెక్ చేయించి.. బాగు చేయించుకోవడం మంచిది.
తడిచిన చేతులతో స్విచ్‌లు నొక్కడం
సాధారణంగా తడి చేతులు విద్యుత్‌ను ఆకర్షిస్తాయి. ఇది ప్రమాదానికి దారి తీస్తుంది. కావున తడిచిన చేతులతో స్విచ్ లు, ఎలక్ట్రిక్ పరికరాలను ముట్టుకోరాదు.
పగిలిన ప్లగ్‌లు, అరిగిపోయిన కేబుల్స్ వెంటనే తీసేయండి. వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చండి. లేదంటే నాణ్యత తగ్గిపోవడం వల్ల పేలుళ్లు, విద్యుత్ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. అలాగే వాడని పరికరాలను ప్లగ్ నుంచి తీసేయండి. ఉదాహరణకు ఛార్జర్
ప్లగ్ పాయింట్లు, స్విచ్ బోర్డులు, ఇతర ఎలక్ట్రిక్ పరికరాల దగ్గర పిల్లలను ఉంచకండి. ఇది విద్యుత్ ప్రమాదాలకు దారితీస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.