/rtv/media/media_files/2025/02/07/blue-dress-during-operation.jpeg)
ఆపరేషన్ థియేటర్లోని లైట్ల కింద ఆకుపచ్చ, బ్లూ రంగులు వైద్యుల కంటి చూపుకు సానుకూలంగా ఉంటయి. ఇది సర్జన్లు తమ పనులపై మెరుగ్గా దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఈ రంగులు ఆపరేషన్ లైట్ల కారణంగా కళ్ళ పై వచ్చే ఒత్తిడిని తగ్గిస్తాయి.
/rtv/media/media_files/2025/02/07/operation-theater.jpeg)
అంతేకాదు ఆపరేషన్ థియేటర్లో ఆకుపచ్చ, నీలం రంగు దుస్తువులు ధరించడానికి మరొక కారణం కూడా ఉంది. ఈ రంగు బట్టలపై రక్తపు మరకలు గోధుమ రంగులో కనిపిస్తాయి. దీని వల్ల వైద్యులకు అసౌకర్యంగా అనిపించకుండా ఉంటుంది.
/rtv/media/media_files/2025/02/07/green-dress-during-operation.jpeg)
మొదటిసారి ఆకుపచ్చ రంగు దుస్తులు ఎప్పుడు ధరించారు?
శస్త్రచికిత్స చేసేటప్పుడు ఆకుపచ్చ యూనిఫాంలు ధరించడం 1914 లో ప్రారంభమైంది. అంతకు ముందు వైద్యులు తెల్లటి దుస్తులు ధరించి శస్త్రచికిత్స చేసేవారు. కానీ 1914లో ఫేమస్ డాక్టర్ వైట్ కి బదులు ఆకుపచ్చ యూనిఫార్మ్ ధరించి ఆపరేషన్ చేశారట. అప్పటి నుంచి ఈ డ్రెస్ కోడ్ ట్రెండ్ గా మారిందని చెబుతారు.
/rtv/media/media_files/2025/02/07/operation-lights.jpeg)
ఒత్తిడి నుంచి ఉపశమనం
కొన్నిసార్లు వైద్యులు ఆపరేషన్ సమయంలో మానవ శరీరంలోని రక్తాన్ని, అంతర్గత అవయవాలను నిరంతరం చూడటం ద్వారా ఒత్తిడికి గురవుతారు. ఇటువంటి పరిస్థితిలో ఆకుపచ్చ , నీలం రంగుల దుస్తులు ధరించడం వల్ల వారి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ రంగులు మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతాయి,
/rtv/media/media_files/2025/02/07/operation.jpeg)
కళ్ళకు ఉపశమనం
ఆకుపచ్చ దుస్తువులు కళ్ళకు ఉపశమనం అందిస్తాయి. ఉదాహరణకు: కళ్ళు సూర్యుడిని లేదా ఏదైనా ప్రకాశవంతమైన వస్తువును చూసి ఏదైనా రంగును చూడగానే బ్లర్ అవ్వడం జరుగుతుంది. కానీ ఆ వెంటనే ఆకుపచ్చ లేదా నీలం రంగు కనిపిస్తే, కళ్ళు విశ్రాంతి పొందుతాయి.
/rtv/media/media_files/2025/02/07/doctors-blue-dress.jpeg)
అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ లోని లైట్ల కింద ఈ రంగులు ధరించడం ద్వారా కళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది. దృష్టి సామర్థ్యం కూడా పెరుగుతుంది.
/rtv/media/media_files/2025/02/07/operation-dress-code.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.