/rtv/media/media_files/2025/05/20/childrenhealth6-896376.jpeg)
Children Health
Health: ఎండలు తగ్గిపోయి.. వర్షాలు మొదలయ్యాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే జబ్బులు కూడా పెరుగుతాయి. తడి, వర్షపు నీరు నిల్వల కారణంగా ఈ సీజన్ లో వైరస్‌లు, బ్యాక్టీరియా ఎక్కువగా విజృంభిస్తాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో దేశంలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారు జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.
తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు పాటించాలి.
తడి బట్టలకు దూరంగా
వర్షం పడిన తర్వాత తడిచిన బట్టల్లో పిల్లలను ఎక్కువసేపు ఉంచకూడదు. చల్లదనం వల్ల జలుబు, జ్వరానికి కారణమవుతుంది.
హైజిన్
పిల్లలు బయటనుంచి ఇంటికి వచ్చిన వెంటనే చేతులు, కాళ్లు, ముఖం శుభ్రం చేయాలి. చేతుల మీద మట్టితో పాటు వైరస్‌లు ఉండే అవకాశం ఉంది.
వేడి ఆహరం
వర్షాకాలంలో బయట తినే పకోడీలు, ఫాస్ట్ ఫుడ్‌లు ఫుడ్ పాయిజనింగ్ కలిగించవచ్చు. బదులుగా ఇంట్లో చేసిన వేడి రొట్టెలు, ఉప్మా, ఇడ్లీ, పకోడీలు ఇవ్వండి.
వేడి నీరు
పిల్లలకు బాయిల్డ్ నీరు లేదా ఫిల్టర్ నీరు మాత్రమే తాగించాలి. వర్షకాలంలో నీటి ద్వారా వ్యాధులు (టైఫాయిడ్, డెంగీ) పెరుగుతాయి.
ఇమ్యూనిటీ బూస్టర్‌లు
డాక్టర్ సలహా మేరకు పిల్లలకు ఇమ్యూనిటీ పెంచే టానిక్‌లు లేదా సిరప్స్ ఇవ్వొచ్చు.
దోమలు దూరంగా
వర్షాకాలంలో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు పెరుగుతాయి. అందువల్ల దోమల స్ప్రే, మష్కిటో నెట్లను ఇంట్లో తప్పనిసరిగా ఉపయోగించాలి.
వెంటనే ప్రాథమిక చికిత్స
చిన్న జలుబు వచ్చినా కూడా అలసత్వం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేదా వేడి నీరు, తులసి కషాయం ఇవ్వాలి.
మురికి నీటిలో
వర్షపు నీటిలో రోడ్డు మీద ఆడటం చిన్నారులకు సరదాగా అనిపించవచ్చు. కానీ అక్కడ బాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. మురికి నీటిలో అడుగుపెట్టకుండా చూడాలి.
ఆరోగ్య తనిఖీలు
వర్షాకాలంలోనూ పిల్లలకు వాక్సినేషన్, రెగ్యులర్ చెకప్‌లు తప్పకుండా చేయించాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
telugu-news | life-style | rainy-season | health-tips-for-rainy-season