/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/How-many-hours-should-women-sleep-a-day--jpg.webp)
sleep
Life Style: నేటి బిజీ లైఫ్ లో ఆలస్యంగా పడుకొని, ఆలస్యంగా నిద్రలేవడం ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. గంటల తరబడి మొబైల్స్, స్క్రీన్ల ముందు సమయాన్ని గడపడం దీనికి ప్రధాన కారణం. అయితే తాజాగా పరిశోధనల ప్రకారం ఆలస్యంగా మేల్కునే అలవాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు ఈ అలవాటు వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి.
Also Read : దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!
ఆలస్యంగా నిద్రలేస్తే కలిగే నష్టాలు
ముడతలు, గీతలు
ఆలస్యంగా మేల్కోవడం చర్మం ఆరోగ్యం, శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సరైన సమయంలో నిద్రపోవడం, మేల్కొనడం చర్మ సౌందర్యాన్ని కాపాడే కొల్లాజెన్ ఉత్పత్తిని నిర్వహించడంలో సహాయపడుతుంది. దీనికి అంతరాయం కలిగినప్పుడు మొహం పై గీతలు, ముడతలు ఏర్పడతాయి.
బీపీ, గుండెజబ్బులు
రాత్రి లేట్ గా పడుకోవడం, ఉదయం ఆలస్యంగా మేల్కొనడం బీపీ, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తగినంత నిద్ర, సకాలంలో నిద్రపోని వారికి గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు కనుగొన్నాయి.
ఒత్తిడి, బరువు
ఆలస్యంగా నిద్రలేవడం శరీరంలోని మెలటోనిన్, కార్టిసాల్ అసమతుల్యతకు దారితీస్తాయి. కార్టిసాల్ స్థాయిలు పెరగడం ఒత్తిడి, బరువు పెరగడానికి కారణమవుతుంది. అలాగే అధిక స్థాయి మెలటోనిన్ నిద్రకు భంగం కలిగిస్తుంది.
నీరసం
ఆలస్యంగా నిద్రలేచే వారు నీరసంగా ఉంటారు. నాణ్యమైన నిద్ర ఏకాగ్రత సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. తద్వారా మీ రోజంతా యాక్టీవ్ గ ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
life-style | latest-news | affects-of-bad-sleep