/rtv/media/media_files/2025/02/17/m4XKpqDSvqnADDOTYmAy.jpg)
raisins health
Raisins: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి ఒక్కరు డైలీ డైట్ లో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. బాదం, అంజీర్, ఎండు ద్రాక్ష, ఖర్జూర వంటి డ్రైట్ ఫ్రూట్స్ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని బలంగా చేయడంతో పాటు చర్మ ఆరోగ్యం, మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అయితే చాలా మంది ఎండు ద్రాక్షలను అలాగే తింటుంటారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎండుద్రాక్షలను నానబెట్టి తినడం ద్వారా ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఆయుర్వేదంలో కూడా ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ప్రస్తావించబడ్డాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం -
మూత్రపిండాల ఆరోగ్యం
ఎండుద్రాక్ష నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సహజ సమ్మేళనాలు కనిపిస్తాయి. నానబెట్టిన ఎండుద్రాక్షలు, వాటిని నీటిని తాగడం ద్వారా శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. అలాగే మూత్రపిండాల ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది.
పొటాషియం పుష్కలం
ఎండుద్రాక్షలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది సోడియం స్థాయిలను సమతుల్యం చేసి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని డైటరీ ఫైబర్, పాలీఫెనాల్స్ కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
ఎముకల ఆరోగ్యం
నానబెట్టిన ఎండుద్రాక్ష ఎముకలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు రోజు గుప్పెడు ఎండుద్రాక్షలను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
/rtv/media/media_files/2025/01/15/3QXVcIPTAWjhby4ioqaB.jpg)
లివర్ డిటాక్సిఫికేషన్
ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిని తాగడం వల్ల కడుపులోని అన్ని విషపదార్థాలు తొలగిపోతాయి. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
రోగనిరోధక శక్తి
నానబెట్టిన ఎండుద్రాక్ష జీవక్రియ, రోగనిరోధక శక్తిని పెచుతుంది. ఎండు ద్రాక్షలోని డైటరీ ఫైబర్ మలబద్దకం సమస్య తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల కడుపు సమస్యలన్నీ దూరమవుతాయి.
రక్తహీనతను
ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే శరీరంలో రక్తం ఏర్పడడానికి కావాల్సిన విటమిన్ బి కాంప్లెక్స్ ఎండుద్రాక్షలలో తగినంత మొత్తంలో లభిస్తుంది. రక్తహీనత ఉన్నవారు ఎండుద్రాక్ష తీసుకోవడం సరైన ఎంపిక.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.