Life Style: ప్లాంక్ చేస్తే నిజంగానే ఏదైనా ప్రయోజనం ఉంటుందా ? మీరే చూడండి

ప్లాంక్ వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో ప్రధాన కండరాళ్ళను బలోపేతం చేస్తుంది. నడుము, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీర భంగిమను మెరుగుపరుస్తుంది

New Update
plank health benefits

plank health benefits

Life Style: వ్యాయామాలలో అనేక రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి ప్లాంక్. ప్లాంక్ అనేది స్ట్రెంగ్త్, బాడీ స్టెబిలిటీకి సంబంధించిన వ్యాయామం. ఇది శరీరంలో ప్రధాన కండరాళ్ళను బలోపేతం చేయడంతో పాటు శరీరాన్నీ కూడా  బలపరుస్తుంది. క్రమం తప్పకుండా ప్లాంక్ చేయడం వల్ల శారీరక,  మానసిక ఆరోగ్యానికి  అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్లాంక్ ఎలా చేయాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. 

ప్లాంక్ ఎలా చేయాలి?

ముందుగా, నేలపై కాళ్ళను, చేతులను ఆనించి పొట్ట భూమికి తగలకుండా  పడుకోండి. ఆ తర్వాత మోచేతులను భుజాల కింద ఉంచి, చేతులను 90 డిగ్రీల కోణంలో ఉంచండి. ఇప్పుడు రెండు పాదాల వేళ్లపై నిలబడి మీ శరీరాన్ని పూర్తిగా నిటారుగా ఉంచండి. తల నుంచి కాలి వరకు భాగం ఒకే రేఖలో ఉండేలా శరీరాన్ని స్ట్రైట్ గా  ఉంచడానికి ప్రయత్నించండి. మీ నడుము,  తుంటిని వంగనివ్వకండి. తల పైకి  లేపనివ్వకండి. 

ప్రయోజనాలు

  • భుజాలు, మణికట్లు బలంగా 

ప్లాంక్ చేయడం వల్ల భుజాలు, మణికట్టు,  చేతుల కండరాలు కూడా బలపడతాయి. ఇది ముఖ్యంగా బరువులు ఎత్తడం లేదా చేతులు ఉపయోగించడం వంటి వ్యాయామాలు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

  • నడుము,  వెన్నునొప్పి నుంచి ఉపశమనం

వెన్నునొప్పి , కూర్చోవడానికి లేదా  నిలబడటానికి ఇబ్బంది ఉన్నవారు ప్లాంక్ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయండి. దీని వల్ల వల్ల నడుము దిగువ భాగం బలపడుతుంది.  నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

  • కండరాలను బలపరుస్తుంది

ప్లాంక్ ప్రధానంగా  (ఉదర, వీపు,  నడుము కండరాలు) కండరాలను బలపరుస్తుంది. ఇది శరీరం మధ్య భాగాన్ని బలోపేతం చేయడమే కాకుండా అక్కడ రక్త ప్రసరణను పెంచుతుంది. క్రమం తప్పకుండా ప్లాంక్ చేయడం వల్ల యాప్స్ (కడుపు కండరాలు),  నడుము కండరాలు బలపడతాయి.

  • భంగిమను మెరుగుపరుస్తుంది

ప్లాంక్ వ్యాయామం చేయడం నిలబడి లేదా కూర్చున్నప్పుడు సరైన భంగిమను నిర్వహించడంలో సహాయపడుతుంది. కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు