/rtv/media/media_files/2025/04/17/tJWezc6gjryjdDRMckLO.jpg)
eating watermelon in summer
Watermelon: వేసవిలో పుచ్చకాయకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. జనాలు కూడా ఎండాకాలంలో దీనిని తినడానికి తెగ ఇష్టపడతారు. దీనిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే కొంతమందికి మాత్రం పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి హానీ కలిగిస్తుంది. ఏ వ్యక్తులు పుచ్చకాయ తినకూడదో ఇక్కడ తెలుసుకోండి.
ఈ ఐదుగురు పుచ్చకాయ తింటే డేంజర్
జీర్ణ సమస్యలు
సాధారణంగా పుచ్చకాయలోని ఫైబర్ జీర్ణక్రియకు చాలా మంచిది. కానీ ఇందులోని లైకోపీన్.. ఇప్పటికే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారికి హానీ కలిగిస్తుంది. గ్యాస్, అసిడిటీ, అపానవాయువు వంటి సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండడం మంచిది.
ఊబకాయం
పుచ్చకాయలోని సహజ చక్కెర పరిమాణం బరువు పెరగడానికి కారణమవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట తింటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణుల అభిప్రాయం.
/rtv/media/media_files/2025/03/16/fN3PQPLylwWXlG6u87zE.jpg)
ఆస్తమా
ఆస్తమా రోగులు కూడా పుచ్చకాయలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే , పుచ్చకాయలో 90 శాతం వరకు నీరు ఉంటుంది. ఇది శరీరంలో చల్లటి ప్రభావాన్ని కలిగిస్తుంది. అలాగే పుచ్చకాయలో అమైనో ఆమ్లం ఆస్తమా రోగులకు సమస్యను పెంచుతుంది.
డయాబెటీస్
డయాబెటీస్ ఉన్నవారు పుచ్చకాయను ఎక్కువగా తినడం మంచిది కాదు. దీనిలో సహజ చక్కర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కావున ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కర స్థాయిలు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యుడి సలహా మేరకు పుచ్చకాయను పరిమిత మోతాదుల తినాలి.
అలెర్జీ సమస్య
అయితే కొంతమందికి పుచ్చకాయ తింటే అలర్జీలు రావచ్చు. ఇప్పటికే ఏదైనా అలెర్జీ సమస్య ఉన్నవారు పుచ్చకాయకు దూరంగా ఉండాలి. లేదంటే మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. పండు తిన్న తర్వాత వాపు, దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, పుచ్చకాయ తినకండి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
telugu-news | life-style | health