Lung Cancer: పొగతాగని వారిలో కూడా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. ఆందోళనలో శాస్త్రవేత్తలు!

ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. అయితే వాయు కాలుష్యం దీనికి ప్రధాన కారణం కావచ్చని పరిశోధకులు అంటున్నారు. 

New Update
lung cancer

lung cancer

Lung Cancer: సాధారణంగా దూమాపానం చేసేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని  చెబుతారు. అయితే లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం, ధూమపానం చేయని వారిలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు కనుగొన్నారు. దీనికి వాయు కాలుష్యం కారణం కావచ్చని పరిశోధకులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!

వాయు కాలుష్యంతో క్యాన్సర్  

ఈ పరిశోధనను ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ మరియు WHO శాస్త్రవేత్తలు చేశారు.అధ్యయనం సమయంలో శాస్త్రవేత్తలు గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ 2022 నుంచి  డేటాను విశ్లేషించారు. ఇందులో  ధూమపానం చేయని వారిలో అడెనోకార్సినోమా క్యాన్సర్ వచ్చే ప్రమాదం  అత్యంత సాధారణమని కనుగొన్నారు. సిగరెట్లు, హుక్కా లేదా బీడీ తాగకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడవచ్చు. సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ధూమపానం చేసేవారిలో కనిపిస్తాయి.  కానీ ఇప్పుడు వాయు కాలుష్యం కూడా దానికి కారణమవుతోంది. 

అడెనోకార్సినోమా అనేది శరీరంలో శ్లేష్మం, జీర్ణ ద్రవాలను తయారు చేసే గ్రంథులలో అభివృద్ధి చెందే క్యాన్సర్. ఈ క్యాన్సర్ కు ధూమపానంతో చాలా తక్కువ సంబంధం ఉందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.  అయితే వాయు కాలుష్యం దీనికి ప్రధాన కారణం కావచ్చు. 2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన అన్ని క్యాన్సర్ కేసుల్లో 53-70 శాతం ఎప్పుడూ ధూమపానం చేయని వ్యక్తులే ఉన్నట్లు  అధ్యయనం వెల్లడించింది. 2022 సంవత్సరంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న దాదాపు 80 వేల మంది మహిళలు వాయు కాలుష్యంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు