Life Style: రోజూ స్నానం చేసినా ప్రమాదమే..! ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు

రోజూ స్నానం చేయడం వల్ల కలిగే లాభాలు కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఎక్కువగా స్నానం చేయడం వల్ల.. సబ్బులోని రసాయనాలు చర్మానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా, ఆయిల్ పొరను తొలగించే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

New Update
shower

shower

Life Style: రోజూవారి దినచర్యలో భాగంగా అందరు ప్రతిరోజు స్నానం చేయడం సహజం.  కొంతమంది పరిశుభ్రత కోసం చేస్తే.. మరికొంతమంది చేయాలి కదా అని చేస్తారు. ఇంకొంతమంది ఫ్రెష్ గా ఉండాలని  రోజుకు రెండు మూడు సార్లు కూడా స్నానం చేస్తారు. అయితే అతిగా స్నానం చేయడం కూడా మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తరచూ స్నానం చేయడం వల్ల ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.. 

అయితే ప్రజలు చేసే అలవాట్లు ప్రాంతాన్ని బట్టి మారుతుందట. అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మాత్రమే రోజూ స్నానం చేస్తారట. అలాగే ఆస్ట్రేలియాలో 80శాతం మందే చేస్తున్నారు. ఇక  చైనాలో సగానికి పైగా మంది వారానికి రెండు సార్లు మాత్రమే స్నానం చేస్తారట. ఇక భారతదేశం విషయానికి వస్తే రోజుకు రెండు లేదా మూడు సార్లైనా చేస్తుంటారు. 

ఎక్కువగా స్నానం చేస్తే ఏమవుతుంది.. 

ఇలా  స్నానం ఎక్కువగా చేయడం వల్ల.. సబ్బులోని రసాయనాలు  చర్మంపై ఉండే ఆయిల్ పొరను తొలగిస్తాయి. అలాగే చర్మానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను కూడా తొలగించే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వేడి నీటితో స్నానం చేస్తేఈ సమస్య మరింత  ఎక్కువయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.  చర్మంపై  నూనె పొర తొలగిపోవడం వల్ల  చర్మం పొడిగా, అసౌకర్యంగా మారి దురద పెడుతుందని తెలిపారు. 

bath
bath

 

 చర్మ సమస్యలు

పొడి చర్మం వల్ల పగుళ్లు ఏర్పడి చెడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుందని  నిపుణులు అంటున్నారు. దీనికరణంగా చర్మ సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.  రోజూ స్నానం చేయడం వల్ల కలిగే లాభాలు కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు నిపుణులు. అలా అని స్నానం చేయకుండా ఉండడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. 

స్నానం ఎలా చేయాలి.. 

ఎక్కువ సమయం స్నానం చేయడం మంచిది కాదు. మూడు నుంచి ఐదు నిమిషాలు చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ ప్రదేశాన్ని సబ్బుతో రుద్దుతూ ఉండకుండా.. చంకలు, ముఖం లాంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు