/rtv/media/media_files/2025/01/11/fmVLaAGaniTS9NRHQolU.jpg)
ఉదయం లేగగానే కాఫీ కావాలంటారు. టీ తాగుతా అంటారు. ఆఫీస్కు వెళ్లిన తర్వాత కూడా కాఫీ లేదా టీ తాగేస్తూ ఉంటారు. సర్వ సమస్యలకు ఈ రెండే పరిస్కారమన్నట్లు ఫీల్ అయిపోతూంటారు కొంతమంది.
/rtv/media/media_files/2025/01/13/E7T0LvrjzXpPhRAwuOeX.jpg)
కానీ వాటిలో ఉండే కెఫిన్ కంటెంట్ చాలా ప్రమాదకరం. ఇది సైన్స్ చెబుతున్న నిజం. కాఫీలో ఉన్న కెఫిన్ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్యలను పెంచుతుంది. అధిక కెఫిన్ తీసుకోవడం గుండె సమస్యలకు కూడా కారణమవుతుంది.
/rtv/media/media_files/2024/12/18/Lvh7pcJTzm2S65iMD9G7.jpg)
కాలంతో కాఫీకి అలవాటు పడడం వల్ల, రోజు ఎక్కువగా కాఫీ తాగాలనుకుంటారు. అయితే కాఫీ, టీలకు అలవాటు పడిన వారికి ఇది చాలా కష్టం. ఇలాంటి వారి కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/COFFE-jpg.webp)
క్రమంగా తగ్గించడం
కాఫీ, 'టీ'ని ఒక్కసారిగా ఆపడం కష్టంగా ఉంటుంది. అందుకే రోజూ తాగే కాఫీ, టీ మోతాదును క్రమంగా తగ్గించండి. మొదట 1 కప్పు తగ్గించి, తర్వాత ఆ మరుసటి రోజుల్లో మరింత తగ్గించండి.
/rtv/media/media_files/2024/11/24/coffee41.jpeg)
మంచి నిద్ర
నిద్రపోకుండా ఉండడం వల్ల కాఫీ తాగాలనిపిస్తుంది. అందువల్ల, కనీసం 7-8 గంటల నిద్ర పోయేలా చూసుకోండి. మంచి నిద్ర మీ శరీరానికి విశ్రాంతి ఇస్తుంది.
/rtv/media/media_files/2024/11/24/coffee61.jpeg)
వ్యాయామం చేయండి
రోజుకు కాసేపు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామం వల్ల శక్తి పెరుగుతుంది. కావున కాఫీ, టీ అవసరం తగ్గుతుంది.
/rtv/media/media_files/2025/01/13/E7T0LvrjzXpPhRAwuOeX.jpg)
నీటిని ఎక్కువగా తాగండి
నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. రోజూ కనీసం రెండు లీటర్ల నీటిని తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రెడెట్గా ఉంచుతుంది. నీటిని తాగడం వల్ల కాఫీ పానీయాల మీద నుంచి మీ ఆకర్షణ తగ్గుతుంది.
/rtv/media/media_files/2024/12/18/Lvh7pcJTzm2S65iMD9G7.jpg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.