/rtv/media/media_files/2025/01/11/L9pjVwnkx1LjEG4wh36A.jpg)
Cancer
Cancer: ప్రస్తుతం క్యాన్సర్ అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది. తాజా పరిశోధన ప్రకారం.. ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక దశలో క్యాన్సర్ కి గురయ్యే అవకాశం ఉంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తాజా నివేదిక ప్రకారం.. 18-25 ఏళ్ల మధ్య వయసు వారిలో క్యాన్సర్ కేసులు సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా బ్రెస్ట్, కోలొరెక్టల్, ప్యాంక్రియాటిక్,యూటీరిన్ వంటి క్యాన్సర్లు 50 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారిలో ఎక్కువగా పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
క్యాన్సర్ నిరోధక వ్యూహాలపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే నిపుణులు అభిప్రాయం ప్రకారం.. కొన్ని జీవనశైలి అలవాట్లు క్యాన్సర్ రిస్క్ ను మరింత ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ఈ అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాన్సర్ రిస్క్ పెంచే జీవన శైలి అలవాట్లు
తంబాకు, ధూమపానం
ధూమపానంతో అనేక రకాల క్యాన్సర్లు సంబంధం కలిగి ఉన్నట్లు తెలిసింది. నోరు, గొంతు, వాయిస్ బాక్స్, ప్యాంక్రియాస్ వంటి క్యాన్సర్లు ఈ అలవాటు కారణంగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తంబాకును వాడకడం నివారించడం క్యాన్సర్ ను నిరోధించడానికి ఒక అద్భుతమైన మార్గం. శారీరక శ్రమ కొలన్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ల సంభవాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
అనారోగ్యమైన ఆహరం
ఆరోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా క్యాన్సర్ పూర్తిగా నివారించలేము. కానీ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఎక్కువగా కూరగాయలు, పండ్లు తీసుకోండి. ఎక్కువ చక్కెరలు, కొవ్వు , క్యాలరీలు ఉన్న ఆహారాలను తగ్గించండి. ట్రాన్స్ శాట్ ఫ్యాట్స్, రెడ్ మీట్ , ప్రాసెస్డ్ మాంసం, రిఫైండ్ కార్బ్స్ కూడా తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మెడిటీరియన్ డైట్ ఉదాహరణకు సీఫుడ్, ప్లాంట్ బెస్డ్ ఫుడ్స్ అనుసరించే వ్యక్తులు బ్రెస్ట్ క్యాన్సర్‌కు తక్కువగా గురవుతారు.
మద్యం
మద్యం మితంగా తీసుకోవాలి. మద్యం అనేక రకాల క్యాన్సర్లకు, ముఖ్యంగా కాలేయం, కిడ్నీ, నోరు, గొంతు, కొలన్, బ్రెస్ట్ క్యాన్సర్లకు సంబంధించి రిస్క్‌ను పెంచుతుంది.
సూర్యరశ్మి నుంచి రక్షణ
తాజా అధ్యయనాల ప్రకారం, స్కిన్ క్యాన్సర్ అనేది అత్యంత సాధారణమైన క్యాన్సర్. ఎక్కువ సమయం సూర్యరశ్మిలో ఉండకండి. సూర్యరశ్మి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు చాలా దుర్భరంగా ఉంటుంది. ఆ సమయంలో ఎండలో తక్కువగా ఉండాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:షుగర్ కంట్రోల్‌లో లేకపోతే ఈ 5 వ్యాధులు తప్పవు