/rtv/media/media_files/2025/03/29/healthyperson1-854618.jpeg)
Healthy person
దాల్చిన చెక్క నీరు
సాధారణంగా దాల్చిన చెక్కను చాలా మంది కేవలం ఒక మసాలాగా మాత్రమే ఉపయోగిస్తారు. కానీ దీనివల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. దాల్చిన చెక్క యాంటీఆక్సిడెంట్లు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కావున ప్రతిరోజూ దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. దాల్చిన చెక్క నీరు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటు సమస్యను నియంత్రణలో ఉంచుతుంది.
రక్తపోటు
దాల్చిన చెక్కలోని పొటాషియం రక్తపోటుపై సోడియం ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. హార్ట్ రేట్ ని కూడా నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే పొటాషియం నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం
మెగ్నీషియం, క్యాల్షియం గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎముకలు బలహీనపడకుండా నిరోధించడంలో కూడా ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.
ఇది కూడా చూడండి:Diet Tips: వర్షాకాలంలో మంచి ఆరోగ్యం కావలా..? ఈ ఆహార చిట్కాలు మీ కోసమే!!
ఆక్సీకరణ ఒత్తిడి
దాల్చిన చెక్కలో పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్షీకరణ ఒత్తిడిని తగ్గించి.. సెల్ డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తాయి. సెల్ డ్యామేజ్ క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.
దాల్చిన చెక్క నీరు ఎలా తయారు చేసుకోవాలి..
- ముందుగా దాల్చిన చెక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
- ఆ తర్వాత దాల్చిన చెక్క ముక్కలను ఒక గ్లాస్ నీటిలో వేసి.. ఆ నీటిని 15-20 నిమిషాలు మరిగించండి. అలా మరిగించిన నీటిని వడకట్టి తాగండి.
అయితే దాల్చిన చెక్క నీటిని మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచింది కాదు. ఇందులోని 'కూమరిన్' అనే కాంపౌండ్ లివర్ సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. చిన్న మొత్తంలో దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి,ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే అధిక బరువు, రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మెడికేషన్ లో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దాల్చిన చెక్కను మీ డైట్ లో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Healthy Breakfast: డేంజర్..! ఈ మూడు టిఫిన్లతో గుండెపోటు ముప్పు