Mouth Cavity : శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవాళ్లను, పంటి ఇన్‌ఫెక్షన్‌లు ఉన్నవాళ్లను నోటిపూత తీవ్రంగా వేధిస్తుంది. నోటిపూత వల్ల భయంకరమైన నొప్పి ఉంటుంది. అయితే వేడి బాగా ఉన్నప్పుడు నోరంతా పుండ్లు పడుతాయి. ఇక ఆ నరకయాతన వర్ణనాతీతం.
అయితే, ఈ సమస్యకు చిన్న చిన్న చిట్కాలతో కూడా ఉపశమనం కలిగించొచ్చు. కొబ్బరి నీళ్లు బాగా తాగాలి. కొబ్బరి నీళ్లకు ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఉంటుంది. ఎండు కొబ్బరిని నమలడంవల్ల కూడా మంచి పరిష్కారం లభిస్తుంది. ఇలా ఎండు కొబ్బరిని నమలడంవల్ల అల్సర్ పుండ్లలోని సూక్ష్మజీవులు నశించిపోతాయి. దాంతో నోటిలో అల్సర్స్ త్వరగా తగ్గిపోతాయి.
Also Read : TGSRTCలో పెరుగుతున్న డొక్కు బస్సులు..
Follow Us