Mental Health: ఎడమచేతి వాటం ఉన్నవారికి ఆ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ!

సైకాలజిస్ట్ నివేదికల ప్రకారం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఎడమచేతి వాటం ఉన్నవారికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, సామాజిక ఒంటరితనం, ఆత్మవిశ్వాసం లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కుంటారు.

left handers (1)

left handers

New Update

Left Handers : సాధారణంగా అందరు ఏదైనా పనులు చేయడానికి, రాయడానికి ఎక్కువగా కుడిచేతినే ఉపయోగిస్తారు. కానీ కొంతమందికి మాత్రం ఎడమచేతి వాటం ఉంటుంది. ఇలాంటి వారు కుడిచేయి కంటే ఎడమచేయినే ఎక్కువగా వాడుతుంటారు. అయితే సైకాలజిస్ట్ అభిప్రాయం ప్రకారం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఎడమచేతి వాటం వారికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Also Read :  అనుష్క కాదు, కాజల్ కాదు.. ప్రభాస్ కి సరైన జోడీ ఈ హీరోయినే!

మానసిక ఆరోగ్య సమస్యలు 

ఎడమచేతి వాటం ఉన్న వ్యక్తులలో నిరాశ,  ఆందోళన వంటి మానసిక  సమస్యలు తలెత్తే  ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు గమనించారు. ఎడమచేతి వాటం అనేది  జన్యుపరమైన కారణాల వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. కొన్ని సందర్భాల్లో సామాజిక పరిస్థితుల వల్ల కూడా ఇది అభివృద్ధి చెందుతుంది.  కుడిచేతి వ్యక్తులతో పోల్చితే ఎడమచేతి వాటం ఉన్నవారిలో మూడ్ స్వింగ్స్,  ఆందోళన, భయము, చిరాకు, విశ్రాంతి లేకపోవడం, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటివి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ దీనికి సరైన కారణమేంటి అనే దానిపై స్పష్టత లేదు. జన్యుపరమైన సమస్యలు, మెదడు కనెక్టివిటీ,  పర్యావరణ పరిస్థితులు వంటి అనేక అంశాలు దీని కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

ఎడమ చేతి వాటం వారిలో మానసిక సమస్యలకు ఇవి కారణం కావచ్చు

బ్రెయిన్ కనెక్టివిటీ: సాధారణంగా మెదడులోని రైట్ హెమిస్పియర్ వ్యక్తి ఎడమ చేతిని నియంత్రిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో లెఫ్టీస్, రైటీస్ మధ్య బ్రెయిన్ కనెక్టివిటీకి సంబంధించి తేడాలు వస్తాయి. ఇది పరోక్షంగా న్యూరాలజికల్ వ్యత్యాసాలకు దారితీస్తుంది. 

పనిముట్లు: ఈ  పర్యావరణంలో మనుషులకు అవసరమయ్యే అనేక సాధనాలు  కుడిచేతి వాటం కలిగిన అనుగుణంగా రూపొందించబడ్డాయి. వీటిని ఎడమచేతి వాటం ఉన్నవారు ఉపయోగించడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటారు. దీని వల్ల వీళ్ళు కాస్త ఒత్తిడి, చిరాకుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

Also Read :  శారీలో ఆషికా అందాలు.. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫొటోలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: ఎంతోమంది హీరోయిన్స్ తో నటించినా.. వీళ్లిద్దరే ప్రభాస్ ఫేవరేట్

#life-style #mental-health
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe