హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజు కార్తీక మొదటి సోమవారం. శివుడిని ఎలా పూజిస్తే పుణ్యఫలం లభిస్తుందో చూద్దాం.
ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!
తప్పకుండా దామోదర పూజ ఆచరించాలి..
కార్తీక మాసంలో సోమవారాలకు ఒక ప్రాధాన్యత ఉంది. శివుడికి ఇష్టమైన సోమవారం రోజున భక్తితో పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. ఈ రోజు మొదటి కార్తీక సోమవారం. నేడు శివుడిని భక్తితో పూజించాలి. వేకువ జామున లేచి నదీ స్నానం చేసి శివుడిని పూజించాలి. ముఖ్యంగా దామోదర పూజ ఆచరించి, కార్తీక పురాణం చదవాలి. నదీతీరంలో ఈ పూజ ఆచరించాలి. అవకాశం లేనివారు ఇంటి దగ్గర చేయవచ్చు. శివుడిని తలచుకుంటూ భక్తితో దీపారాధన, అభిషేకం చేయాలి.
ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!
కార్తీక సోమవారం రోజు శివ ఆలయాన్ని సందర్శించాలి. భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి ఉపవాసం ఆచరించాలి. రోజంతా ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివుడిని దీపాలతో పూజించి, అప్పుడు ఉపవాసం విరమించాలి. కార్తీక సోమవారం నాడు దానం చేయడం వల్ల వేయి జన్మల పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా మొదటి సోమవారం నాడు శివుడిని భక్తితో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.
ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పండితులను సంప్రదించి సూచనలు తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం