/rtv/media/media_files/2025/02/23/hair1-688164.jpeg)
hair
మారిన జీవనశైలి, బిజీ షెడ్యూల్డ్, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం, పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్ల తీవ్రంగా జుట్టు రాలిపోతుంది. ప్రస్తుతం రోజుల్లో ఎన్ని హెయిర్ ఆయిల్స్, సీరమ్స్ వంటివి ఉపయోగించినా కూడా ఫలితం లేకుండా పోతుంది. జుట్టు సమస్యలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఎలాంటి జుట్టు సమస్యలు లేకుండా బలంగా, దృఢంగా పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Copper Bottle Water: రాగి పాత్ర నీళ్లలో ఉన్న మిరాకిల్స్.. ఈ అద్భుత ప్రయోజనాలు మిస్ కాకండి..!!
ఈ గింజల జెల్‌తో..
జుట్టు అధికంగా రాలిపోతున్న వారికి ఈ టిప్ బెస్ట్ అని చెప్పవచ్చు. రేల కాయలు, కలోంజి సీడ్స్, మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్‌ను టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. వీటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత వచ్చిన వాటర్ లేదా జెల్‌ను జుట్టు కుదళ్ల నుంచి అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలిపోకుండా బలంగా ఉంటుంది. అలాగే తెల్ల జుట్టు కూడా తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇందులో వాడిన కలోంజి సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే మెంతుల్లో సోడియం, పొటాషియం, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు రాలిపోకుండా చేయడంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
పోషకాలు ఉండే ఫుడ్
జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా పెరగాలంటే చిట్కాలతో పాటు ఫుడ్ కూడా తీసుకోవాలి. డైలీ డైట్‌లో గుడ్లు, పాలు, చేపలు, ఆకుకూరలు, బీట్‌రూట్, పప్పులు, డ్రైఫూట్స్ వంటివి తీసుకోవాలి. వీటితో పాటు ఒత్తిడి ఉండకూడదు. దీనివల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేయాలి. వీటివల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గడంతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
ఆముదంతో మర్దన
జుట్టు దృఢంగా పెరగాలంటే ఆముదంతో మర్దన చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ పెరిగి జుట్టు బలంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. రోజుకి రెండు సార్లు లేదా ఒకసారి అయినా జుట్టు కుదుళ్లకు ఆముదం నూనెతో అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా మర్దన చేస్తే రాలిపోయిన జుట్టు కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఆముదం నూనె కాస్త జిడ్డుగా ఉంటుంది. నచ్చని వారు ఇందులో ఆలివ్, కొబ్బరి, బాదం వంటి నూనెలను ఇందులో కలిపి జుట్టుకు పెట్టవచ్చు. ఎందుకంటే వీటిన్నింటిలో విటమిన్ ఈ, పోషకాలు ఎక్కువగా వస్తాయి.
ఇది కూడా చూడండి: Young Age: ఈ అలవాట్ల ఉంటే యవ్వనంలోనే చర్మంపై ముడతలు.. వయస్సు కాక మరో కారణాలు ఇవే
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.