చిన్న వయస్సులో రజస్వల.. ఐటెమ్ సాంగ్స్ కూడా ఓ కారణమా? ఐటెమ్ సాంగ్స్, కామెడీ షోలలో అడల్ట్ కంటెంట్ వల్ల అమ్మాయిలు తొందరగా రజస్వల అవుతున్నారని కొందరు నిపుణులు అంటున్నారు. పిల్లలకు ఇలాంటివి కాకుండా బయట గేమ్స్ ఆడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. By Kusuma 02 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి పిల్లలు అన్నింట్లో యాక్టివ్‌గా ఉండాలని చిన్నప్పటి నుంచి వారికి డ్యాన్స్, సంగీతం, కామెడీ షోలు వంటి వాటికి తల్లిదండ్రులు పంపిస్తుంటారు. అయితే ఇలాంటి షోలు చేసేటప్పుడు చిన్న వయస్సులో అమ్మాయిలకు శరీర ఆకృతి లేకపోతే బాడీని చూపించడానికి ఇతర పద్ధతులు ప్రయత్నిస్తారు. అలాగే ఐటెమ్ సాంగ్స్, అడల్ట్ కంటెంట్ ఉండే పాటలు పాడుతుంటే పిల్లలకు సందేహాలు కూడా వస్తాయి. దీంతో తల్లిదండ్రులను అడుగుతారు. ఒకవేళ తల్లిదండ్రులు చెప్పకపోతే ఇతరులను అడుగుతారు. ఇవన్నీ వారి జీవితంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చూడండి: హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆటలు.. కొండా సురేఖ సంచలన ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా.. ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలు చిన్న వయస్సులోనే డ్యాన్స్‌లు చేయడం, పాటలు పాడటం వంటివి చేస్తున్నారు. ఇలా చేసేటప్పుడు చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అదే అడల్ట్ కంటెంట్ పాటలు, ఐటెమ్ సాంగ్స్‌కి డ్యాన్స్ వేస్తే తల్లిదండ్రులు చూడటానికి కాస్త ఇబ్బంది పడతారు. ఇవన్నీ పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించడం లేదు. కానీ సోషల్ మీడియా ద్వారా వారే అన్ని విషయాలను నేర్చుకుంటున్నారు. కాబట్టి మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో కాస్త గమనించాలి. ఇది కూడా చూడండి: ఒక్కేసి పువ్వేసి నుంచి నేటి నగాదారిలో వరకు.. దుమ్ములేపిన బతుకమ్మ సాంగ్స్ ఇవే! తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఇస్తుంటారు. కానీ వారు ఏం చూస్తున్నారు? మొబైల్ ద్వారా ఏం నేర్చుకుంటున్నారో అని మాత్రం గమనించడంలేదు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి పిల్లలు వారి వయస్సుకి అవసరం లేని విషయాలు ఎక్కువగా నేర్చుకుంటున్నారు. ఈ ఐటెమ్ సాంగ్స్, డబుల్ మీనింగ్ కామెడీ వంటివి బాగా వినడం వల్ల అమ్మాయిలు చిన్న వయస్సులోనే రజస్వల అవుతున్నారని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది పూర్తిగా తెలియదు. ఇది కూడా చూడండి: బయలుదేరిన కొన్ని క్షణాలకే కూలిన హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం పెద్దవారిలా నటించడానికి, పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతారట. దీనివల్ల వారు మానసికంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. టీవీ షోలు, ఇలాంటి అడల్ట్ కామెడీలకు పిల్లలను తల్లిదండ్రులు సపోర్ట్ చేయవద్దు. వీటికి బదులు పిల్లలను ఆటలకు పంపించడం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సపోర్ట్ చేయడం, వారికి మొబైల్ ఇచ్చిన తల్లిదండ్రులు పక్కనే ఉండి ఏం చేస్తున్నారో కనిపెడుతుంటే చెడు అలవాట్లకు బానిస కారని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చూడండి: టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త! #item-song #girls మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి