బయలుదేరిన కొన్ని క్షణాలకే కూలిన హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం

మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఘటన చోటుచేసుకుంది. ఉదయం 6:45 నిమిషాలకు పూణెలో బయలుదేరిన హెలికాప్టర్ క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. పొగమంచు వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update
helicopter'

మహారాష్ట్రలోని పూణెలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. పుణెలో ఆక్సస్‌ఫర్డ్ గోల్ఫ్‌క్లబ్ హెలిప్యాడ్ నుంచి బయలు దేరిన హెలికాప్టర్ బావ్‌దాన్ దగ్గర రెండు కొండల మధ్య కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇది కూడా చూడండి: విషాదం.. కాల్వలో ముగ్గురు గల్లంతు

 

పొగమంచు కారణంగా..

హెలికాప్టర్‌లో ఇద్దరు పైలెట్లు, ఇంజినీర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం 6:45 నిమిషాలకు పుణెలో బయలు దేరిన విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోయింది. పొగ మంచు విపరీతంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. మృతుల వివరాలు, హెలికాప్టర్ ప్రైవేట్‌ లేదా ప్రభుత్వానిదా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి:  ఘోర ప్రమాదం.. 23 మంది దుర్మరణం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు