ఈ పువ్వు లడ్డూ తింటే.. వేల ప్రయోజనాలన్నీ మీ సొంతం

ఇప్ప పువ్వు లడ్డు తింటే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటంతో పాటు కీళ్ల సమస్యలు, చర్మ సమస్యలు అన్ని కూడా తగ్గిపోతాయని అంటున్నారు. వీటితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

New Update
Ippa Puvvu Laddu

Ippa Puvvu Laddu Photograph: (Ippa Puvvu Laddu)

మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ఇటీవల ఇప్ప పువ్వుల గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో చాలామంది అసలు ఇప్ప పువ్వు ఏంటి? దీంతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటి? దీంతో చేసిన లడ్డూలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!

కీళ్ల నొప్పులు

ఈ ఇప్ప పువ్వులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే మోకాల నొప్పులు, కండరాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇప్ప పువ్వుతో తయారు చేసిన నూనెను తీసుకుంటే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందట. 

ఇది కూడా చూడండి:  Sikandar Collections: సల్మాన్ ఖాన్ కి పైరసీ దెబ్బ.. తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే

జీర్ణక్రియ
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. 

రోగనిరోధక శక్తి
ఈ పువ్వులతో తయారు చేసిన లడ్డూలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. 

చర్మ సమస్యలు
ఈ పువ్వులు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి అలర్జీలు రాకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఉంటాయి. ఇవి దురద, దద్దుర్లు, తామెర వంటి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Kumar Sangakkara : 51 ఏళ్ల బ్యూటీతో 47 ఏళ్ల కుమార సంగక్కర డేటింగ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు