30-30-30 పద్ధతి అంటే ఏమిటి.. బరువు తగ్గడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? బరువు తగ్గాలనుకుంటే ముందుగా కేలరీలను తగ్గించాలి. 30-30-30 ఫార్ములాను పాటిస్తే నెలలో చెడు కొవ్వు తగ్గి శరీరం మంచి ఆకృతిలోకి వస్తుంది. దీనికోసం వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఆహారం నమిలి తినడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Sep 2024 | నవీకరించబడింది పై 25 Sep 2024 07:26 IST in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Weight loss: ప్రస్తుత కాలంలో వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో ఊబకాయం ఒకటి. దీనికి అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు. అయితే భారతదేశంలోనే 135 మిలియన్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. మీ బరువు పెరిగి, మీరు స్థూలకాయానికి గురైనట్లయితే.. ఈరోజు నుండే 30-30-30 ఫార్ములాను పాటించాలి. ఈ ఫార్ములా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ఒక నెలలో కొవ్వును తగ్గించడంతోపాటు శరీరాన్ని ఆకృతిలోకి తీసుకురాగలదని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరిగి, స్థూలకాయం తగ్గి ఫిగర్ బాగుండాలంటే..30-30-30 ఫార్ములాను ఎలా పాటించాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు చూద్దాం. కొవ్వును తగ్గి శరీరం ఆకృతిలోకి రావాలంటే.. బరువు తగ్గాలనుకుంటే ముందుగా కేలరీలను తగ్గించాలి. 30-30-30 సూత్రం కూడా దీనిపై దృష్టి పెడుతుంది. ఈ నియమం ప్రకారం.. రోజువారీ కేలరీల తీసుకోవడం 30 శాతం తగ్గింస్తే బరువు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. రోజువారీ శక్తి వ్యయం 2,000 కేలరీలు అయితే.. దాదాపు 1,400 కేలరీలు తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. కేలరీలను నియంత్రించే లక్ష్యాన్ని క్రమంగా సాధించడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం పోషకాలు, నీరు ఎక్కువగా ఉండే ఆహారం మాత్రమే తీసుకోవాలి. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, నమలడం కూడా అంతే ముఖ్యం. ఆహారాన్ని రుచి చూసి నమిలిన తర్వాతే తినాలి. నియమం ప్రకారం.. తినడానికి కనీసం 30 నిమిషాలు తీసుకోవాలి. ఈ ప్రక్రియను మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటారు. ఇది జీర్ణక్రియను ఆరోగ్యవంతంగా చేస్తుంది. బరువు వేగంగా తగ్గుతుంది. భోజనం చేసేటప్పుడు టీవీ, మొబైల్ చూడకూడదని గుర్తుంచుకోవాలి. వ్యాయామం ఫిట్‌నెస్, ఆరోగ్యం రెండింటినీ మెరుగుపరుస్తుంది. బరువు తగ్గించడంలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల క్యాలరీలు కరిగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికోసం వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read : ఓటీటీలోకి నారా రోహిత్ పొలిటికల్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే #obesity #weight-loss #health-problems మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి