Holi 2025: హోలీలో కల్తీ రంగులతో ప్రాణానికే ప్రమాదం.. ఈ చిట్కాలతో గుర్తించండి

హొలీ సమయంలో మనం వాడే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరోగ్యానికే ప్రమాదం. అయితే హోలీ రంగులలో కల్తీని గుర్తించడానికి  కొన్ని మార్గాలు  ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

author-image
By Archana
New Update
holi colors

holi colors

Holi Colors: హొలీ అనగానే రంగుల పండగ.  ఆత్మీయులంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా హొలీ పండగను జరుపుకుంటారు. అయితే హొలీ సమయంలో మనం వాడే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరోగ్యానికే ప్రమాదం. ప్రతీ సంవత్సరం హొలీ రోజూ రంగులు నిజమైనవా?  లేదా నకిలీవా?  అని తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. అయితే హోలీ రంగులలో కల్తీని గుర్తించడానికి  కొన్ని మార్గాలు  ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కల్తీ రంగులను గుర్తించడానికి చిట్కాలు

ప్రకాశవంతమైన రంగులు 

ప్రకాశవంతమైన,  ముదురు రంగులు వాస్తవానికి నకిలీవి. ఈ రకమైన రంగుల్లో  గాజు పొడి, చక్కటి ఇసుక, పాదరసం సల్ఫైడ్ మొదలైన వాటిని కలుపుతారు. దీనివల్ల ఆ రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వాటిని చర్మానికి పూస్తే  హాని కలుగుతుంది. కావున హోలీ రోజున ఎక్కువ ప్రకాశవంతమైన రంగులను కొనకండి. 

చేతుల్లో పట్టుకుని గుర్తించండి

రంగులు కొనే ముందు, దాన్ని మీ చేతుల్లో పట్టుకుని ఒకసారి తనిఖీ చేయండి. రంగును తాకినప్పుడు చాలా జిడ్డుగా లేదా పొడిగా అనిపిస్తే, ఆ రంగు సింథటిక్ రసాయనాలతో కల్తీ చేయబడి ఉండవచ్చని అర్థం.   అయితే, సహజ రంగులలో కల్తీ ఉండదు.. కావున అవి జిడ్డుగా, పొడిగా  అనిపించవు. 

వాసన చూసి 

హోలీ రంగులలో కల్తీని గుర్తించడానికి ఈ చిట్కా ఉత్తమమైన సులభమైన మార్గం.  అరచేతిలో కొంత రంగు తీసుకొని దానిని వాసన చూడండి. రంగు నుంచి పెట్రోల్, మొబైల్ ఆయిల్, కిరోసిన్ ఆయిల్, రసాయనం లేదా ఏదైనా సువాసనగల పదార్థం వాసన వస్తే.. ఆ రంగు నకిలీదని అర్థం చేసుకోండి. సహజ రంగుల వాసన ఎప్పుడూ బలంగా ఘాటుగా ఉండదు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు