నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. అయితే చాలా మంది నెయ్యిని ముద్ధపప్పులో వేసుకుని తింటారు. అసలు ఈ రెండింటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? తింటే శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌పై ఒక లుక్కేయండి.
ఇది కూడా చూడండి: ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ
కడుపు సంబంధిత సమస్యల నుంచి విముక్తి
పప్పులో నెయ్యి కలుపుకుని తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం, అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇలా తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. అలాగే కీళ్ల సమస్యల నుంచి విముక్తి కల్పించడంలో కూడా పప్పు, నెయ్యి కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చూడండి: వీధిన పడ్డ ఉద్యోగులు.. రెచ్చిపోయిన సోమిరెడ్డి..!
రోగనిరోధక శక్తి పెరుగుదల
నీరసం, అలసటగా ఉండే పప్పులో నెయ్యి వేసుకుని తింటే తక్షణమే శక్తి లభిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నెయ్యిలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అయితే రోజూ పప్పులో నెయ్యి వేసుకుని తినకూడదు. ఆరోగ్యానికి మంచిదే.. కానీ మితంగా మాత్రమే తీసుకోవాలి.
ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్
మెదడు ఆరోగ్యం
నెయ్యిలోని పోషకాలు మెదడుని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే మార్కెట్లో దొరికే కల్తీ నెయ్యి కాకుండా ఇంట్లోనే సహజంగా నెయ్యి తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అలాగే పప్పు, నెయ్యి కలిపి తినడం వల్ల తొందరగా బరువు కూడా పెరుగుతారు. కాబట్టి బరువు ఎక్కువగా ఉన్నవారు అధికంగా తినవద్దు.
ఇది కూడా చూడండి: ఆలయంలో పేలిన బాణాసంచా.. 150 మందికి పైగా గాయాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.