Fenugreek: మెంతికూరతో మొండి తామరకు ఇలా చెక్ పెట్టండి! తామర చాలా చిరాకుగా ఉంటుంది. దురద, పొడి పాచెస్ తరచుగా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మెంతి గింజల్లో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు తామరతో సంబంధం ఉన్న వాపు, ఎరుపును తగ్గిస్తాయి. చర్మ సంబంధిత వ్యాధులను మెంతులు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Sep 2024 in లైఫ్ స్టైల్ వెబ్ స్టోరీస్ New Update షేర్ చేయండి Health Tips: చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో మెంతులు చాలా మేలు చేస్తాయి. చర్మం స్థితిని మెరుగుపరచడంతో పాటు మళ్లీ సాధారణ స్థితికి తీసుకొస్తాయి. తామర అనేది ఎంతో చిరాకు కలిగిస్తుంది. దురద, పొడి పాచెస్ తరచుగా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సహజ సిద్ధమైన మార్గంలో తామర తగ్గించుకోవచ్చు. శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో మెంతులు ఉపయోగిస్తున్నారు. వంటల్లో సైతం మెంతులు ఎక్కువగా వాడుతుంటాం. తామర లేదా అటోపిక్ చర్మశోథ అనేది మంట, ఎరుపు, దురదతో కూడిన దీర్ఘకాలిక చర్మ పరిస్థితి. ఈ పరిస్థితి తరచుగా చర్మంపై దురద, పొడి పాచెస్‌లా కనిపిస్తుంది, చర్మం ఎర్రబడటంతో పాటు ఇన్ఫెక్షన్ ఉంటుంది. మెంతి గింజల్లో శ్లేష్మం, సపోనిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. మెంతి గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి తామరతో సంబంధం ఉన్న వాపు, ఎరుపును తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి గింజలలో ఉండే శ్లేష్మం నీటిలో కలిపినప్పుడు జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇది మంటను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #fenugreek మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి