Elephant Dance: అమ్మాయిలతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఏనుగు

ఇద్దరు యువతులు భరతనాట్యం చేస్తుండగా ఏనుగు వారి వెనుక తిరుగుతూ లయబద్ధంగా డ్యాన్స్‌ చేయడం లక్షలాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. లక్షలాది లైక్‌లు, వేలాది కామెంట్లు కురిపిస్తున్నారు.ఈ ఏనుగు డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు.

New Update
Viral Video.

Viral Video

Viral Video: భరతనాట్యం చేస్తున్న అమ్మాయిలతో కలిసి ఏనుగు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే ఏనుగు ఊగడం ఒత్తిడికి సంకేతమని నిపుణులు అంటున్నారు. ఇద్దరు యువతులు భరతనాట్యం చేస్తుండగా ఏనుగు వారి వెనుక తిరుగుతూ లయబద్ధంగా డ్యాన్స్‌ చేయడం లక్షలాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ఒకరు డ్యాన్స్ చేసే ఏనుగులో కంటికి కనిపించిన దానికంటే.. నిజానికి ఆ జంతువు ఒత్తిడికి గురవుతుందని అన్నారు.

ఏనుగు డ్యాన్స్‌ని చూసి నెటిజన్లు ఫిదా..

ఈ వీడియోలో ఇద్దరు యువతులు నాట్యం చేస్తుండగా ఒక కట్టేసి ఉన్న ఏనుగు వారిని అనుసరిస్తూ డ్యాన్స్‌ చేయడం చూడవచ్చు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏనుగు డ్యాన్స్‌ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లక్షలాది లైక్‌లు, వేలాది కామెంట్లు కురిపిస్తున్నారు. దీనిపై ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి కస్వాన్‌ స్పందించారు. ఏనుగులు ఒత్తిడికి గురైనప్పుడే ఇలా చేస్తాయని చెబుతున్నారు.

Also Read: భూమిలో పెరిగే ఈ దుంప తింటే.. హెల్దీ ఆరోగ్యం మీ సొంతం



ఏనుగులు ఒత్తిడికి గురైనప్పుడు లేదా విసుగు చెందినప్పుడు లేదా గొలుసులతో బంధిస్తే తరచూ ఇలాగే ఊగుతుంటాయని, స్టీరియోటైపిక్ బిహేవియర్ అని పిలువబడే ఈ ప్రవర్తన ఏనుగుల్లో సాధారణం అంటూ కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఏనుగు డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు.

Also Read: నువ్వులు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Also Read: ఛీ వీళ్లు మనుషులా?.. తల్లిని శ్మశానంలో వదిలేశారు

Also Read: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలు ఇవే

Advertisment
Advertisment
తాజా కథనాలు