/rtv/media/media_files/2025/08/10/viral-video-2025-08-10-08-16-54.jpg)
Viral video
Viral video: ఏనుగులు భూమిపై ఉన్న అతి పెద్ద, శక్తివంతమైన జంతువుల్లో ఒకటి. వాటి శాంతమైన స్వభావానికి అవి ప్రసిద్ధి చెందాయి. కానీ కొన్నిసార్లు మానవులకు, వాటికి మధ్య ఘర్షణలు తలెత్తుతాయి. ఆహారం లేదా నివాస ప్రాంతాల కోసం, మనుషుల కార్యకలాపాల వల్ల వాటికి కలిగే ఇబ్బందులతోపాటు వాతావరణ మార్పుల వంటి కారణాల వల్ల కూడా ఏనుగులు దాడి చేస్తాయి. ఈ దాడులు మనుషుల ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఏనుగుల దాడులను అర్థం చేసుకోవడం, వాటిని నివారించడానికి మార్గాలను కనుగొనడం కష్టమే. తాజాగా యూపీలో ఏనుగు కారు దాడి చేసి బీభత్సం సృష్టించింది.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా..
డెహ్రాడూన్-హరిద్వార్ హైవేపై టోల్ ప్లాజా దగ్గర ఒక ఏనుగు బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉన్న రోడ్డుపైకి వచ్చిన అడవి ఏనుగు, మార్గమధ్యంలో ఉన్న వాహనాలను బెదిరించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏనుగు కారుపై దాడి చేయడానికి ప్రయత్నించగా.. డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ ప్రాంతంలో ఏనుగులు కనిపించడం సర్వసాధారణమని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికులను, ప్రయాణికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది.
Elephant Creates Chaos at Lachhiwala Toll Plaza, Lifts and Smashes Barrier; Incident Comes Days After Same Elephant Overturned Devotees’ Tractor-Trolley on Dehradun-Haridwar Highway. pic.twitter.com/4Fmp0zu5Sv
— Krishna Chaudhary (@KrishnaTOI) August 9, 2025
పెద్ద అడవి ఏనుగు ఈ రోజు ఉదయం రోడ్డు అవతలి వైపుకు వెళ్ళేందుకు ప్రయత్నించింది. మార్గమధ్యలో ఉన్న వాహనాలపై దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో చూపించిన దాని ప్రకారం.. ఏనుగు రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంది. టోల్ లేన్‌లో ఆగి ఉన్న కారును తన తొండంతో బలంగా కొట్టడం కనిపించింది. అయితే.. కారు డ్రైవర్ అప్రమత్తంగా వేగంగా వాహనాన్ని ముందుకు పోనిచ్చి సురక్షితంగా తప్పించుకున్నాడు.
ఇది కూడా చదవండి: మంచి నిద్ర కావాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.!!
ఈ సంఘటన స్థానికులను, ప్రయాణికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ టోల్ ప్లాజా దగ్గర ఏనుగులు దాదాపు ప్రతిరోజూ కనిపిస్తున్నాయని.. దీనివల్ల భద్రతకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఏనుగులు తిరిగే ప్రాంతం కావడంతో వాటిని అదుపు చేయడం సవాలుగా మారింది. ఈ సంఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని.. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏనుగుల కదలికలను పర్యవేక్షించి, వాటిని సురక్షితమైన మార్గంలో పంపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సంఘటన తర్వాత అటవీ అధికారులు ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: ఈ ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు మొక్కజొన్న కంకికి దూరంగా ఉంటే బెటర్