/rtv/media/media_files/2024/11/10/salt55.jpeg)
Salt Photograph: (Salt)
ఏ వంటకానికి అయినా కూడా ఉప్పు లేకపోతే అసలు టేస్ట్ ఉండదు. వంటలు అన్ని రుచిగా ఉండాలంటే తప్పకుండా ఉప్పు అవసరం. అయితే ఉప్పు అనేది తక్కువగా తిన్నా, ఎక్కువగా తిన్నా కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. తక్కువగా తింటే లో బీపీ, ఎక్కువగా తింటే హైబీపీ వస్తుంది. దీంతో కొందరు వైద్యులు ఉప్పును తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోమని చెబుతుంటారు. అయితే లిమిట్లో కాకుండా ఎక్కువ మొత్తంలో ఉప్పు తీసుకోవడం వల్ల పొట్ట క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఉప్పులో ఎక్కువగా అయోడిన్ ఉంటుంది. ఇది శరీరానికి కాస్త లిమిట్‌లోనే అవసరం.
ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ
క్యాన్సర్ కణితులు..
అంతకంటే ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదకరం. కొందరు చాలా ఎక్కువగా ఉప్పు, కారం వంటల్లో ఉంటేనే తింటారు. దీనివల్ల పొట్ట క్యాన్సర్ వస్తుంది. అధిక ఉప్పు వల్ల పొట్టలోని పొర అంతా కూడా పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో అక్కడ క్యాన్సర్ కణితులు ఎక్కువగా పెరుగుతాయి. అలాగే పొట్ట క్యాన్సర్‌ను పెంచే ఫైలోరి బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. దీనివల్ల కడుపులో కణాల పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కాకుండా ఉప్పును తక్కువగా మాత్రమే తీసుకోండి. కాస్త చప్పగా తిన్నా కూడా ఎలాంటి నష్టం లేదు.
ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు
ప్రతీ వ్యక్తి రోజుకి కేవలం ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువగా తీసుకుంటే తప్పకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కుటుంబంలో పొట్ట క్యాన్సర్ ఎవరికైనా ఉంటే తప్పకుండా వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వంశపారంపర్యంగా కూడా వస్తుందని అంటున్నారు. కాబట్టి కుటుంబంలో ఎవరికైనా ఉన్నవారు తక్కువగా ఉప్పు తీసుకోవడం ఉత్తమం. అయితే ఉప్పును కాకుండా ఇవి ఉన్న పదార్థాలు కూడా తక్కువగానే తీసుకోండి.
ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!