Coffee: జీవనశైలిలో మార్పులు, జంక్‌ఫుడ్, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి కారణంగా ఈ మధ్యకాలంలో గుండెపోటులు పెరిగిపోతున్నాయి. స్మోకింగ్, ఆల్కహాల్, నిద్రలేమి ఇవన్నీ కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిన్న వయస్సులోనే చాలా మంది బీపీ, మధుమేహంతో పాటు గుండె సంబంధిత వ్యాధులబారిన పడుతున్నారు. అయితే తాజాగా చేసిన సర్వేలో కాఫీ తాగితే గుండె జబ్బులు రావాని తేలింది. కాఫీకి గుండె సమస్యల మధ్య సంబంధంపై కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
అధ్యయనంలాఓ ఏం తేలింది?
కాఫీని రెగ్యులర్‌గా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చని ఓ అధ్యయనం తేలింది. సంవత్సరాలుగా కాఫీతో గుండె ఆరోగ్యంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మితమైన కాఫీ వినియోగం వాస్తవానికి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీ తక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అంటున్నారు. జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం రోజూ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు.
గుండె వైఫల్యం:
21,000 మంది పెద్దలపై జరిపిన ఒక అధ్యయనంలో మితంగా కాఫీ తాగే వారిలో గుండె ఆగిపోయే ప్రమాదం 11శాతం తగ్గిందని అంటున్నారు. 21 అధ్యయనాల్లో రోజుకు 3 నుంచి 4 కప్పుల కాఫీ తాగేవారిలో ముప్పు 17శాతం తక్కువగా ఉంటుందని కనుగొన్నారు. అలాగే కార్డియోవాస్కులర్ మరణాలు 10శాతం తగ్గాయని అంటున్నారు. 4 లక్షల మందిపై జరిపిన ఒక అధ్యయనంలో మితమైన కాఫీ వినియోగం హృదయనాళాల ఫెయిల్యూర్‌తో సంభవించే మరణాలను 10శాతం తగ్గించిందని తేలింది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read : మూసీ పక్కన నిర్మాణాలను ముట్టుకోం.. టెన్షన్ వద్దు.. హైడ్రా చీఫ్ సంచలన ప్రకటన!