Sivakasi: బాణసంచా రాజధాని శివకాశి కథేంటి? దీపావళి రోజున బాణసంచా కాల్చడం భారతీయ సంస్కృతిలో భాగం. భారతదేశంలోని పటాకుల రాజధానిగా తమిళనాడులోని శివకాశిని పిలుస్తారు. అయితే శివకాశిలో పటాకుల వ్యాపారం ఎలా మొదలైంది.. ఇక్కడ క్రాకర్ల తయారీ ఎలా ప్రారంభమైందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 30 Oct 2024 | నవీకరించబడింది పై 31 Oct 2024 09:46 IST in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Fireworks షేర్ చేయండి Sivakasi: ఆధునిక కాలంలో బాణసంచా చైనా నుంచి వచ్చిందని చెబుతుంటారు. గన్‌పౌడర్ ఆరు, తొమ్మిదవ శతాబ్దాల మధ్య తయారు చేశారు. టాంగ్ రాజవంశం వారు గన్‌పౌడర్‌ను కనుగొన్నారు. దీంతో బాణసంచా కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. భారతదేశానికి గన్‌పౌడర్, బాణసంచా పరిచయం చేసిన ఘనత మొఘలులదే. మొదటి పానిపట్ యుద్ధంలో మొఘలులు గన్‌పౌడర్, ఫిరంగిలతో భారతదేశానికి వచ్చారు. బాబర్ తనతో పాటు గన్‌పౌడర్‌ని భారతదేశానికి తీసుకువచ్చాడు. అక్బర్ కాలం నాటికి బాణసంచా పెళ్లిళ్లు, వేడుకల్లో భాగంగా మారింది. చైనాలో గన్‌పౌడర్‌ను వెదురులో నింపి వెలిగించేవారు. భారతదేశంలో వెదురు స్థానంలో చిన్న మట్టి కుండలు, నేడు కార్డ్బోర్డ్, కాగితం వాడుతున్నారు. Also Read : కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ ! అగ్గిపెట్టె ఫ్యాక్టరీలో పని చేయడం.. శివకాశికి ముందు బ్రిటీష్ కాలంలో కోల్‌కతాలో బాణసంచా తయారీ కర్మాగారాలు ప్రారంభించారు. అగ్గిపెట్టెలను తయారు చేసే ఫ్యాక్టరీలు పటాకుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాయి. తర్వాత ఇక్కడ నుంచి ఒక కర్మాగారం శివకాశికి వచ్చింది. వాస్తవానికి శివకాశి నివాసితులైన పి. అయ్య నాడార్, సోదరుడు శముంగ నాడార్ 1923లో ఉద్యోగం వెతుక్కుంటూ కోల్‌కతా చేరుకుని అక్కడ ఒక అగ్గిపెట్టె ఫ్యాక్టరీలో పని చేయడం ప్రారంభించారు. సుమారు 8 నెలల పాటు పని నేర్చుకుని తిరిగి వచ్చి జర్మనీ నుంచి యంత్రాలను తెప్పించి అనిల్ బ్రాండ్, అయ్యన్ బ్రాండ్ పేర్లతో అగ్గిపెట్టెల తయారీ ప్రారంభించారు. ఆ తర్వాత అదే బ్రాండ్ పేరుతో మార్కెట్‌లో బాణసంచాను విడుదల చేసి తక్కువ కాలంలోనే శివకాశిని దేశానికి బాణసంచా రాజధానిగా మార్చారు. ఇది కూడా చదవండి: CHD అంటే ఏంటి?.. పెద్దవారికి ఇది ప్రమాదమా? ప్రస్తుతం తమిళనాడులోని శివకాశిలో దాదాపు 8,000 చిన్న, పెద్ద బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీరి వార్షిక వ్యాపారం కూడా దాదాపు వెయ్యి కోట్లు. ఒకప్పుడు వీరి వ్యాపారం రూ.6,000 కోట్లు కాగా భారత్ నుంచి విదేశాలకు పెద్దఎత్తున బాణసంచా ఎగుమతి అయ్యేవి. మారుతున్న కాలంతో పాటు ఇక్కడ వ్యాపారం చేసే విధానం కూడా మారిపోయింది. ప్రస్తుత కాలంలో ఇక్కడ బాణసంచా ఉత్పత్తి కూడా 40 శాతానికి పైగా తగ్గింది. Also Read : ఏపీలో మందుబాబులకు పండగే పండగ.. ధరలు తగ్గింపు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: పోలీసులు ఖాకీ రంగు యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారు? #tamilnadu #diwali-2024 #sivakasi crackers shop మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి