Darshan: కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్‌ !

కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దర్శన్ జులై 11న అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయ్యారు.

New Update
darshan 11

darshan

అభిమాని రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు దర్శన్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్సల కోసం 6 వారాల పాటు బెయిల్‌ మంజురు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన ప్రియురాలు పవిత్ర గౌడ్ ను రేణుకస్వామి అనే వ్యక్తి  సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడంతో.. అతడిని హత్య చేయించాడనే ఆరోపణలతో దర్శన్ జైలుకు వెళ్ళాడు. 
జూన్ 11న అరెస్టైన దర్శన్ గత నాలుగు నెలలుగా జైల్లోనే ఉన్నాడు. దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ్ తో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Also Read :  బాణసంచా రాజధాని శివకాశి కథేంటి?

అసలేమైందంటే.. 

పోలీసుల వివరాల ప్రకారం.. రేణుకాస్వామి అనే వ్యక్తి  దర్శన్‌ అభిమాని. అయితే అతడు నటి పవిత్రా గౌడతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు వస్తున్న ఆరోపణలతో తమ హీరో పేరుప్రతిష్టలు దెబ్బతింటున్నాయని అతడు భావించేవాడు. దీంతో ఒక నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను సృష్టించి పవిత్రకు అసభ్యకరమైన మెస్సేజ్‌లు పంపి వేధించేవాడు. దీంతో పవిత్ర ఈ విషయాన్ని దర్శన్‌కు చెప్పింది. ప్రియురాలిని వేధిస్తున్న రేణుకా స్వామిపై ఆగ్రహించిన దర్శన్‌ తన ఫ్యాన్స్‌ క్లబ్‌కు చెందిన రాఘవేంద్ర, కార్తీక్‌, కేశవమూర్తిని సంప్రదించాడు.

Also Read: 'మట్కా' నుంచి మరో కొత్త పోస్టర్.. వైరల్ అవుతున్న లుక్

తమ అభిమాన హీరోనే తమ వద్దకు వచ్చి సాయం అడగటంతో వారు కూడా దానికి ఆనందంగా ఒప్పుకున్నారు. దీంతో సుపారీ కింద దర్శన్‌ వారికి రూ.5 లక్షలు ఇచ్చాడు. తన పేరు బయటకు రాకూడదని, వారు అరెస్టయితే అవసరమైన లీగల్‌ ఖర్చులు కూడా భరిస్తానని చెప్పాడు. దీంతో జూన్ 8న 
 రేణుకాస్వామిని అతని ఇంటి సమీపంలో అడ్డగించిన దర్శన్‌ అభిమానులు అతడిని కామాక్షి పాల్యలోని ఒక షెడ్‌లోకి తీసుకెళ్లారు.

Also Read :  మీ అంతు చూస్తా.. ఏసీపీ, ఎస్‌పై రెచ్చిపోయిన రఘునందన్‌ రావు

అక్కడికి వచ్చిన దర్శన్‌ బెల్టుతో స్వామిని చితకబాదాడు. తర్వాత దర్శన్‌ అభిమానులు కూడా అతడిని విపరీతంగా కొట్టడంతో స్వామి మరణించాడు. దీంతో ఈ విషయాన్ని నిందితులు దర్శన్‌కు తెలియజేసి , పరిస్థితిని చక్కదిద్డడానికి మరో రూ.25 లక్షలు తీసుకున్నారు. రేణకా స్వామి మృతదేహాన్ని ఒక మురుగు కాల్వలో పడేశారు. ఈ కేసులోని నిందితులంతా ప్రస్తుతం  బెంగళూరులోని వివిధ జైళ్లలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Also Read: ఇంత అందగా ఉందేంటి.. రాశీ ఖన్నా దీపావళి మెరుపులు

Advertisment
Advertisment
తాజా కథనాలు