Diwali: ప్రతి సంవత్సరం నరక చతుర్ధశిని కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున యముడిని పూజించే సంప్రదాయం ఉంది.ఈ రోజున యమణ్ని పూజించడం వల్ల అకాల మరణాల ప్రమాదం నివారిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ రోజు సాయంత్రం దీపదానం చేయడం వల్ల నరకంలో ఉన్న అన్ని హింసలు, పాపాల నుండి విముక్తి లభిస్తుందని, అందుకే నరక చతుర్దర్శి రోజున దీపదానం చేసి పూజించే సంప్రదాయం ఉందని చెబుతారు.
Also Read: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో వానలు
ఈ రోజున పూజలు చేసి ఉపవాసం ఉండేవారు కూడా యమరాజు విశేష అనుగ్రహాన్ని పొందుతారు. యముడ్ని మాత్రమే కాకుండా నరక చతుర్దశి రోజున శ్రీకృష్ణుడిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. నరక చతుర్దశి ని నరక్ చౌదాస్, రూప్ చతుర్దశి , రూప్ చౌదాస్ అని కూడా పిలుస్తారు.
Also Read: నాపై డ్రగ్స్ కుట్ర చేశారు..ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అసలు దీనిని నరక చతుర్దశి అని ఎందుకు అంటారు. దాని వెనుక ఉన్న విశ్వాసం ఏంటో తెలుసుకుందాం.
నరక చతుర్దశి పౌరాణిక కథ
నరకాసురుడు అనే రాక్షసుడు తన రాక్షస శక్తితో 16 వేల మంది స్త్రీలను బంధించాడు. నరకాసురుని భీభత్సం, దౌర్జన్యాలతో కలత చెందిన దేవతలు, ఋషులు సహాయం కోసం శ్రీకృష్ణుడ్ని వేడుకున్నారు. అప్పుడు శ్రీ కృష్ణుడు నరకాసురుడిని సంహరించి దేవతలను, సాధువులను అతని దౌర్జన్యం నుండి విడిపించాడు. నరకాసురుడిని సంహరించిన తరువాత, శ్రీ కృష్ణుడు ఆ 16 వేల మంది స్త్రీలను నరకాసురుని చెర నుండి విడిపించాడు. ఈ ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి నరకాసుర సంహారం జరుపుకున్నారు. ఈ కారణంగా, అప్పటి నుండి దీనిని నరక చతుర్దశి అని పిలుస్తారు.
Also Read: ఏపీలో కరవు మండలాల జాబితా విడుదల.. 5 జిల్లాల్లో 54 మండలాలు
ఈ రోజున ఏం చేయాలి?
నరక చతుర్దశి రోజున ఇంటిని శుభ్రం చేసి, పనికిరాని వస్తువులన్నీ పారేయండి. ఇంటి నుండి అన్ని రకాల విరిగిన వస్తువులను తొలగించండి. దీపాలను దానం చేయండి. ఈ రోజున 14 దీపాలు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. యమ దీపం కూడా వెలిగించండి నరక చతుర్దశి రోజున ఇంటి దక్షిణ దిశను శుభ్రంగా ఉంచండి. నరక చతుర్దశి రోజున దక్షిణ దిశలో యమ నామంతో దీపం వెలిగించండి. ఇంటి ప్రధాన ద్వారం, బయట, కూడలి, ఖాళీ స్థలంలో దీపాలను ఉంచండి. ఈ రోజున ఆవనూనె దీపాలను మాత్రమే వెలిగించండి.