ఆరోగ్యానికి మేలు చేసే ఖర్జూర పండ్లను అందరూ తింటారు. వీటిని తిన్న తర్వాత ఇందులో ఉండే గింజలను పడేస్తుంటారు. అయితే ఈ ఖర్జూరంతో పాటు ఈ గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని పడేయకుండా పొడి చేసుకుని వాడితే శరీర ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఖర్జురం గింజల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: MH: మహారాష్ట్రలో పని చేసిన పవన్ ప్రచారం..ఒక్క చోట మాత్రం..
డయాబెటిస్
ఖర్జూర విత్తనాలు మధుమేహం ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయి. ఇందులోని కాల్షియం, జింక్ వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఈ ఖర్జూరం గింజల పొడిలో ఇన్సులిన్ ఉత్పత్తి లక్షణాలు ఉంటాయి. ఈ పొడిని రోజూ తాగితే ఈ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. వేడి నీరు లేదా పాలలో కలిపి తాగడం వల్ల డయాబెటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
కిడ్నీలో రాళ్లు
కొందరు మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఖర్జూర గింజల పొడిని తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గడంతో పాటు కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని ఔషధ గుణాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడతాయి. అయితే ఈ గింజలను బాగా శుభ్రం చేసుకుని కాస్త దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుని వాడితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఇది కూడా చూడండి: నేడే ఐపీఎల్ మెగా వేలం.. ఏ ఫ్రాంఛైజీ దగ్గర ఎంత ఉందంటే?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది..చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో సంచలనాలు