Cloves: లవంగం ఎక్కువగా తీసుకుంటే అనర్థాలు తప్పవా?

లవంగాలు రుచిగా ఉండటమే కాకుండా ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. లవంగాలు ఎక్కువగా తినడం వల్ల నోటిలో నొప్పి, వాపు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు వస్తాయని వైద్యులు అంటున్నారు.

New Update
clovespurse8

Cloves

Cloves: లవంగాలు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలు ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ లవంగాలు ఎక్కువగా తీసుకుంటే హానికరం.  లవంగాలు రుచిగా ఉండటమే కాకుండా ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పులావ్‌తో సహా అనేక వంటకాలకు రుచిని జోడించడానికి  లవంగాలను కలుపుతాం. మూలికా టీ లేదా కషాయాలను లవంగాలు, మసాలా సహాయంతో తయారుచేస్తారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. లవంగాలతో ఇంక ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్ లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఎక్కువగా తినడం వల్ల నోటిలో నొప్పి  వస్తుంది :

లవంగాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నా వాటిని అతిగా తింటే ఎన్నో రకాల నష్టాలను చవిచూడాల్సి వస్తుందని వైద్యులు అంటున్నారు.లవంగాల్లో యూజినాల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది శరీరంలో అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. లవంగాలలో ఉండే యూజినాల్‌ను మితంగా తీసుకోవాలి. లేకుంటే తలనొప్పి, కళ్లు తిరగడం, బలహీనత ఏర్పడవచ్చు.  లవంగాలు ఎక్కువగా తినడం వల్ల నోటిలో నొప్పి, వాపు , రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Also Read :  చలికాలంలో మడమలు పగులుతున్నాయా?..ఇలా చేయండి

కాబట్టి లవంగాలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. చాలా మంది లవంగాలు ఎక్కువగా తింటుంటారు. అలాంటి వారికి కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు ఉండవచ్చు. మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు వస్తాయని వైద్యులు అంటున్నారు. అందుకని లవంగాలను తక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also Read :  ఈ ఆహారంతో చలికాలంలో మెరిసే చర్మం పొందండి



Also Read :  Miracle Fruit: మిరాకిల్‌ ఫ్రూట్‌.. ఇవి తింటే నిజంగా మిరాకిలే..

Advertisment
తాజా కథనాలు