/rtv/media/media_files/2024/12/02/RZvWc8ksUIZKeE1yZyam.jpeg)
మీరు ఇంతకు ముందెన్నడూ చూడని మిరాకిల్ ఫ్రూట్, చూడటానికి చెర్రీలా ఉండే అరుదైన జాతి ఫ్రూట్, దీని శాస్త్రీయ నామం సిన్సెపలమ్ డల్సిఫికమ్, ఇది ఆఫ్రికా దేశంలో మాత్రమే ఉండే ఈ పండుకు అరుదైన లక్షణాలు ఉన్నాయి.. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
/rtv/media/media_files/2024/12/02/miraclefruit2.jpeg)
ఆఫ్రికా దేశంలో ఉండే పొదల జాతికి చెందిన ఫ్రూట్ సిన్సెపలమ్ డల్సిఫికమ్, ఎరుపు రంగులో చెర్రీ ఆకారంలో ఉండే ఈ ఫ్రూట్ ప్రత్యేక ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు... దీనిని నోట్లో వేసుకుంటే రెండు గంటల పాటు ప్రత్యేక అనుభూతి కలుగుతుంది.
/rtv/media/media_files/2024/12/02/miraclefruit7.jpeg)
చూడటానికి ఎరుపు రంగులో నోరూరించేలా కనిపించే ఈ పండు అంత తియ్యగా ఉండదు.. కానీ ఈ ఫ్రూట్ ప్రత్యేక ఏమిటంటే దీనిని ఒకసారి తిన్నామంటే మీ నాలుకపై రుచి మొగ్గలను ప్రభావితం చేస్తాయి, ఈ ఫ్రూట్ తిన్న తర్వాత నిమ్మకాయ లాంటి పుల్లనివి ఏమి తిన్నా అవి మనకు తియ్యగానే అనిపిస్తాయి.. ఇదే దీని ప్రత్యేకత, ఈ ప్రభావం గంట నుంచి రెండు గంటల పాటు ఉంటుంది
/rtv/media/media_files/2024/12/02/miraclefruit1.jpeg)
ఆఫ్రికా దేశంలో మాత్రమే లభించే ఈ పళ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అక్కడి ప్రజలు నమ్ముతారు, ఈ పండులో ఉండే గింజలతో చేసిన నూనె వల్ల జుట్టురాలడం తగ్గుతుందట, అంతే కాదు తలపై ఉండే చర్మం ఆరోగ్యంగా మారి ఊడిపోయిన జుట్టు మళ్లీ చిగురించే అవకాశాలు ఉన్నాయి.
/rtv/media/media_files/2024/12/02/miraclefruit5.jpeg)
ఇన్ని అద్భుత గుణాలు ఉన్న ఈ పండు వల్ల చాలా నష్టాలు ఉన్నాయంటున్నారు వైద్యులు, వీటిని రోజూ తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయంట, చాతీలో మంటగా అనిపిస్తుంది, ఎసిడిటీ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు, అజీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయంట
/rtv/media/media_files/2024/12/02/WkOw6gplwxYNub70nIOG.jpeg)
ఇదీ ఈ మిరాకిల్ ఫ్రూట్ ప్రత్యేక లక్షణాలు.. అందుచేత ఇవి దొరికితే రుచి చూసి వదిలేయండి తప్ప.. అతిగా తీసుకుంటే చాలా ప్రమాదాలున్నాయి.. మరి జాగ్రత్త