/rtv/media/media_files/2025/09/02/lunar-eclipse-2025-09-02-15-24-49.jpg)
lunar eclipse
నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. రాత్రి 9:58 గంటలకు గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ అర్థ రాత్రి 1:28కు ముగుస్తుంది. అయితే గ్రహణం ప్రారంభం అయ్యే ముందు నుంచి పూర్తి అయ్యే వరకు కొన్ని నియమాలు పాటించాలి. చాలా మంది ఆకలికి తట్టుకోలేక గ్రహణం సమయంలో తినేస్తారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కొందరు తెలిసే తెలియక కొన్ని పదార్థాలను తీసుకుంటారు. వీటివల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం నాడు తీసుకోకూడని ఫుడ్స్ ఏంటో మీకు తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.
ఈ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలని..
సాధారణంగా గ్రహణం సమయంలో జీర్ణక్రియ, జీవక్రియ నెమ్మదిస్తాయి. దీంతో ఈ సమయంలో తింటే ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. అందుకే ఈ గ్రహణం సమయంలో చాలా తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేలా చేస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణులు అయితే అసలు తినకూడదు, తాగకూడదని పండితులు చెబుతున్నారు. పొరపాటున ఏవైనా తింటే గర్భధారణ సమస్యలు పెరుగుతాయని పండితులు అంటున్నారు.
సాయంత్రం 6 గంటల్లోగా తినాలి..
గ్రహణం సమయంలోనే కాకుండా గ్రహణం స్టార్ట్ కావడానికి కొన్ని గంటల ముందు కూడా ఫుడ్స్ తీసుకోకూడదని చెబుతున్నారు. గ్రహణం రాత్రి 9:58 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమయానికి మూడు గంటల ముందే ఫుడ్ కంప్లీట్ చేయాలని చెబుతున్నారు. సాయంత్రం 5 లేదా 6 గంటల్లోగా లైట్ ఫుడ్స్ తీసుకోవాలని పండితులు అంటున్నారు. ఇడ్లీ, దోశ వంటి లైట్ ఫుడ్స్ తీసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల గ్రహణం అయ్యే సమయానికి మీరు తినే ఫుడ్ జీర్ణం అవుతుందని, ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని అంటున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్, ఆల్కహాల్, అన్నం అసలు తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు.
ఆల్కహాల్ తీసుకోవద్దు..
గ్రహణం పూర్తి అయిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి, అన్నం కాకుండా టిఫిన్స్ తీసుకోవాలి. చాలా లైట్‌గా ఉండే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గ్రహణం తర్వాత కూడా ఇంట్లో నాన్‌వెజ్ వంట చేయకూడదని పండితులు చెబుతున్నారు. దోషాలు ఏవైనా ఉంటే శివాలయం వెళ్లి పూజలు చేసుకోవాలి. మంత్రం జపించడం, దానం చేయడం, గంగాజలం చల్లడం వంటివి చేయాలని పండితులు తెలిపారు.