Bullet Coffee: డైలీ బుల్లెట్ కాఫీ తాగితే.. ఇన్ని ప్రయోజనాలా!

బుల్లెట్ కాఫీని డైలీ తాగితే ఆరోగ్యంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటితోొ పాటు జీర్ణ సమస్యలను తగ్గించడం, రోజంతా కూడా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారట.

New Update
Bullet Coffee

Bullet Coffee Photograph: (Bullet Coffee)

బుల్లెట్ కాఫీని డైలీ తీసుకుంటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మనలో చాలా మందికి బుల్లెట్ కాఫీ గురించి పెద్దగా తెలియదు. ఎక్కువగా హెల్తీ ఫ్యాట్స్ ఉండే ఈ బుల్లెట్ కాఫీని పౌడర్‌తోనే చేస్తారు. సాధారణ కాఫీ కంటే ఈ బుల్లెట్ కాఫీ ఆరోగ్యానికి మంచిది. దీన్ని చైన్ ట్రైగ్లిజరైడ్ ఆయిల్​ లేదా కొబ్బరి నూనెతో తయారు చేస్తారు. అయితే ఈ బుల్లెట్ కాఫీ ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

రోజంతా యాక్టివ్

బుల్లెట్ కాఫీని ఉదయం పూట తాగడం వల్ల యాక్టివ్‌గా ఉంటారు. మీకు శక్తి లభిస్తుంది. ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. బుల్లెట్ కాఫీలో నెయ్యి, కొబ్బరి నూనె ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. శరీరానికి తక్షణమే శక్తిని ఇచ్చి మానసికంగా కూడా హాయిగా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఫోకప్ పెరిగేలా
బూల్లెట్ కాఫీ తాగడం వల్ల పనిపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎలాంటి చెడు ధ్యాస ఉండకుండా పని చేస్తారు. అలాగే ఈ కాఫీ తాగితే కడుపు నిండుగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్‌గా కూడా మీరు ఈ కాఫీని తీసుకోవచ్చు. 

ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

బరువు తగ్గడం
ఈ కాఫీ తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ఇందులోని కార్బోహైడ్రేట్లు మీ శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. 

జీర్ణ సమస్యలు
బుల్లెట్ కాఫీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ఇది శరీరంలోని మంటను తగ్గించి ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. 

ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు