Belly Fat Control Tips: జిమ్‌‌కు వెళ్లకుండా బెల్లీ ఫ్యాట్‌ కంట్రోల్.. ఇలా చేస్తే చాలు- డాక్టర్ షాకింగ్ ఫ్యాక్ట్స్

జిమ్‌కు వెళ్లకుండా ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోవచ్చని ఓ వైద్యురాలు తెలిపారు. భోజనానికి ముందు ప్రతిరోజూ నాలుగు టమోటాలు తినాలని అన్నారు. ఇది బొడ్డు కొవ్వును కరిగించి ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుందని తెలిపారు. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

New Update
Belly Fat Control Tips

Belly Fat Control Tips

ప్రస్తుత కాలంలో చాలా మంది బిజీ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. కనీసం తీరిక లేకుండా తీవ్రమైన ఒత్తిడి సమయాన్ని గడుపుతున్నారు. ఉరుకులు పరుగుల ఉద్యోగ జీవితం.. జీవన శైలిలో మార్పుల కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేక అనారోగ్యం బారిన పడుతున్నారు. అదే సమయంలో ఆకలితో నోటికి ఏది దొరికితే అది తినేసి శరీరంలో కొవ్వును పెంచుకుంటున్నారు. బయట దొరికే జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, పిండి పదార్థాలు అధికంగా తినడంతో ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు. 

Belly Fat Control Tips

ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉండే అతి ముఖ్యమైన సమస్య బెల్లీ ఫ్యాట్. ఇది అతి పెద్ద సమస్యగా మారింది. ఎంతో మంది బెల్లీ ఫ్యాట్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకొందరు తమ ఫ్యాట్ తగ్గించుకోవడానికి వ్యాయామాలు, జిమ్‌లలో తీవ్రంగా కష్టపడుతున్నారు. కానీ ఎక్కడా ఎలాంటి ప్రయోజనం పొందలేకపోతున్నారు. అయితే జిమ్‌కు వెళ్లకుండానే ఇంట్లో మీ బెల్లీ ఫ్యాట్‌ను ఎలా తగ్గించుకోవచ్చో ఒక నిపుణురాలు తెలిపారు. 

ఆమె పేరు డాక్టర్ ఉపాసన వోహ్రా. జిమ్‌కు వెళ్లకుండా బెల్లీ ఫ్యాట్‌ను ఎలా తగ్గించుకోవచ్చో ఆమె తెలిపారు. ఆమె ప్రకారం.. భోజనానికి ముందు ప్రతిరోజూ నాలుగు టమోటాలు తినాలని డాక్టర్ ఉపాసన వోహ్రా సూచించారు. ఏ భోజనంలోనైనా టమోటాలు చేర్చి తినాలని చెబుతున్నారు. టమోటాలను నార్మల్‌గా తినలేని సమయంలో.. వాటిపై ఉప్పు, కొద్దిగా నల్ల మిరియాలు వేసి తినవచ్చని ఆమె తెలిపారు.

టమోటాల ప్రయోజనాలు

ఇది బొడ్డు కొవ్వును కరిగించి ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే టమోటాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టమోటాలు రుచికరమైనవి మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని బలోపేతం చేస్తాయి. టమోటాలలో లైకోపీన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడానికి, శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. టమోట తినడం వల్ల జీవక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా కేలరీల బర్నింగ్ పెరుగుతుంది. అదనంగా టమోటాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించి ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

గమనిక: ఈ వార్త సమాచారం కోసం మాత్రమే. ఇలాంటివి పాటించే ముందు సమీపంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Advertisment
తాజా కథనాలు