Banana: సాధారణంగా అమ్మాయిలకు చర్మ సౌందర్యం అనేది చాలా ముఖ్యమైనది. అయితే వయస్సు పెరుగుతున్న కొద్ది చర్మం ముడతలు పడటం, సాగడం వంటి వృద్ధాప్య సంకేతాలు చర్మంపై కనిపించడం ప్రారంభిస్తాయి. ఇలాంటి వృద్ధాప్య ఛాయలను దూరం చేయడానికి ఈ ఫేస్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : గ్రేట్ రెండు చేతులు లేకున్నా..!
యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్స్
అరటిపండు ఫేస్ మాస్క్
- అరటి పండు ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని దెబ్బతినకుండా కాపడతాయి. అలాగే అరటి పండులోని విటమిన్లు, మినరల్స్ చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
అరటి పండు ఫేస్ మాస్క్ తయారీ విధానం:
- ముందుగా ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ పెరుగు, ఒక చిన్న అరటి పండును ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత వీటిని మెత్తగా స్మ్యాష్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది మెరిసే చర్మాన్ని అందించడంతో పాటు,
హై డ్రెటింగ్ గా ఉంచుతుంది.
బొప్పాయి ఫేస్ ప్యాక్:
- బొప్పాయిలోని పాపాయిన్ అనే ప్రత్యేక ఎంజైమ్ చర్మం నుంచి టాక్సిన్స్ తొలగించి ముఖ ఛాయను కాంతివంతంగా చేస్తుంది. అలాగే పాపాయిన్ ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల చర్మానికి మెరుపు, మృదుత్వం వస్తాయి. బొప్పాయిలో లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయను తగ్గిస్తాయి.
బొప్పాయి ప్యాక్ తయారీ విధానం:
- ముందుగా ఒక కప్పు తరిగిన పచ్చి బొప్పాయి, 1 టీస్పూన్ తేనె మరియు 1 టీస్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఒక గిన్నెలో ఈ మూడింటినీ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి .ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలు పాటు మొహానికి పట్టించి..తరువాత శుభ్రం చేసుకోండి.
Also Read : ఇజ్రాయెల్ దగ్గర అతి పెద్ద బాంబ్..వణుకుతున్న ఇరాన్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్