రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోంది: కేంద్ర మంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుత రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో వందకు వంద శాతం కరెక్ట్ గా జరుగుతుందని ఎవరూ చెప్పరన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గామారాయి.

New Update

రాజకీయాలపై గుంటూరు టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోందన్నారు. నీతిగా... నిజాయితీగా రాజకీయం చేయాలి.. ప్రజాసేవ చేయాలి అనే వారికి రాజకీయాలు దూరమయ్యాయన్నారు. ఇది వాస్తవం అన్నారు. నేడు ఎలక్షన్స్ అంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ అయిపోయిందన్నారు. ఎలక్షన్ వచ్చేసరికి నాయకులే గ్రామాల నుంచి వచ్చి డబ్బులు పంచాలని ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళని పీక్కు తింటున్నారన్నారు. ఇదో పెద్ద సమస్య అని, అందరూ చర్చించాలన్నారు. తాను మొన్నటి ఎన్నికల్లో చివరి రోజు ప్రచారానికి వెళ్తే కొందరు తన దగ్గరికి వచ్చి మాకు డబ్బులు రాలేదు అని అడిగారన్నారు. దీన్ని బట్టి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. వ్యవస్థలో వందకు వంద శాతం కరెక్ట్ గా జరుగుతుందని ఎవరూ చెప్పరన్నారు. ఉచిత ఇసుక విధానంలో అక్కడక్కడా లోపాలు ఉన్నాయన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు