Dasara 2025: 60 ఏళ్ల తర్వాత స్పెషల్ దసరా.. ఆ 6 రాశుల వారికి లక్కే లక్కు!

నవ పంచమ రాజయోగం వల్ల విశేషమైన అదృష్టాన్ని పొందబోయే 6 రాశులు ఉన్నాయి. గతంలో ఎదుర్కొన్న కష్టాలు, సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చేపట్టే ఏ కొత్త పనిలోనైనా వీరు విజయం సాధిస్తారు. నవ పంచమ రాజయోగం పట్టే రాశుల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

author-image
By Vijaya Nimma
New Update
Dasara 2025

Dasara 2025

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల అనుకూల స్థితి వల్ల ఏర్పడే నవ పంచమ రాజయోగం కొన్ని రాశులపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ యోగం కారణంగా ఆయా రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. గతంలో ఎదుర్కొన్న కష్టాలు, సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చేపట్టే ఏ కొత్త పనిలోనైనా వీరు విజయం సాధిస్తారు. నవ పంచమ రాజయోగం వల్ల విశేషమైన అదృష్టాన్ని పొందబోయే ఆరు రాశులు మరియు వాటికి కలిగే ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఈ రాశులకు అదృష్ట యోగం..

సింహ రాశి (Leo): వీరికి ఈ యోగం అదృష్టాన్ని తెస్తుంది. పాత పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు, సహకారం లభిస్తుంది. విదేశాలలో ఉన్నవారి నుంచి శుభవార్తలు వింటారు.

కన్య రాశి (Virgo): ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి, కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

వృశ్చిక రాశి (Scorpio): వీరు చేపట్టిన పనుల్లోని అడ్డంకులు తొలగిపోతాయి. వారసత్వ ఆస్తి కలిసి వచ్చి రుణభారం తీరుతుంది. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్ మరియు జీతాల పెరుగుదల ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు రాశి (Sagittarius): బుధ, గురు, శుక్ర గ్రహాల కలయికతో ఏర్పడే ఈ యోగం వీరికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పట్టిన పనులన్నీ సజావుగా పూర్తి అవుతాయి. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది.

మకర రాశి (Capricorn): వీరికి మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో మంచి పురోగతి మరియు లాభాలు ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు సృష్టించుకునే అవకాశం ఉంది. సంపదలో మంచి వృద్ధి కనిపిస్తుంది.

  ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు మరియు వృత్తిపరంగా అద్భుతమైన లబ్ధి చేకూరుతుంది. గత ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు కోరుకున్న చోటుకు బదిలీ జరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సమయం అన్ని విధాలుగా అనుకూలం. ఈ ఆరు రాశుల వారికి ఇకనుంచి అదృష్టం కలిసి వచ్చి జీవితం సంతోషంగా మారుతుందని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. నివారణకు సంబంధిత పండితులని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అక్టోబర్ 1 లేదా 2.. నవరాత్రి ఉపవాసం ముగించడానికి సరైన రోజు ఏదో తెలుసా?

Advertisment
తాజా కథనాలు