/rtv/media/media_files/2024/12/02/5OXYxGoMIZOTcULGOTCv.jpg)
చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. టీ తాగడం వల్ల మైండ్ రిలీఫ్ అవుతుంది. కానీ ఇందులోని కెఫిన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ టీ, కాఫీల కంటే ఆరోగ్యానికి మేలు చేసే అశ్వగంధ టీని తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాస్త అశ్వగంధ పొడిలో తులసి ఆకులు, కొంచెం నీరు వేసి గోరువెచ్చగా చేసుకోవాలి. అంతే ఇక టీ రెడీ అయినట్లే.
ఇది కూడా చూడండి: ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్..
పీరియడ్స్ సమస్య నుంచి..
ఈ అశ్వగంధ టీని డైలీ ఉదయం తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధ టీ తాగడం వల్ల ఒత్తిడి, జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలు, వాపుల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ అశ్వగంధ టీ బాగా ఉపయోగపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. పీరియడ్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ టీని తాగడం వల్ల పొత్తికడుపులో నొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..
నిద్రలేమితో బాధపడుతున్నవారు రాత్రిపూట ఈ అశ్వగంధ టీని తాగితే బాగా నిద్రపడుతుంది. రోజుకి రెండు సార్లు తాగిన ఆరోగ్యానికి మంచిదే. అయితే ఈ అశ్వగంధ పొడి మార్కెట్లో లభ్యమవుతుంది. రసాయనాలతో తయారు చేసే అశ్వగంధ పొడిని కాకుండా సహజంగా ఉన్న పొడిని కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు రోజూ తాగితే క్లియర్ అవుతుంది.
ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: పుష్ప-2పై టీడీపీ ఎంపీ ట్వీట్.. వెంటనే డిలీట్