Hair Health: ఈ ఆయిల్ తలకు అప్లై చేస్తే.. ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం

తలకు రోజ్మెరీ, లెమన్ గ్రాస్, గంధపు నూనె అప్లై చేయడం వల్ల జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కొబ్బరి లేదా ఆముదం నూనె కలిపి రాస్తే.. జుట్టు దృఢంగా ఉంటుంది. ఈ ఆయిల్‌ను వారానికి కనీసం రెండు సార్లు అయినా రాస్తే రిజల్ట్ ఉంటుంది.

New Update
Hair tips

Hair tips Photograph: (Hair tips)

సీజన్‌తో సంబంధం లేకుండా కొందరి జుట్టు రాలిపోతుంది. రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఎక్కువగా జుట్టు బలహీనమై చిట్లిపోతుంది. అయితే జుట్టు బలంగా, దృఢంగా పెరగాలంటే మాత్రం కొన్ని రకాల నూనెలను తలకు అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

రోజ్మెరీ ఆయిల్

జుట్టు బలహీనమై ఎక్కువగా రాలుతుంటే మాత్రం తప్పకుండా రోజ్మెరీ ఆయిల్‌ను అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి. కుదుళ్ల నుంచి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. కేవలం ఈ ఒక్క ఆయిల్ మాత్రమే కాకుండా కొబ్బరి నూనెలో కలిపి దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు చిట్లిపోకుండా ఉంటుంది. వారానికి కనీసం రెండు సార్లు అయిన ఈ నూనెను తలకు అప్లై చేయండి. 

ఇది కూడా చూడండి: YS Jagan: పేరు చెప్పకుండా బాలయ్యకు జగన్ విషెస్.. ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో మళ్లీ ఏమని ట్వీట్ చేశాడంటే?

లెమన్ గ్రాస్ ఆయిల్
లెమన్ గ్రాస్ ఆయిల్‌ జుట్టుకు బాగా పనిచేస్తుంది. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. జుట్టు కూడా కుదుళ్ల నుంచి దృఢంగా తయారు అవుతుంది. దీంతో జుట్టు రాలిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ ఆయిల్‌ను జుట్టుకు అప్లై చేసిన తర్వాత తలస్నానం చేయాలి.  

ఇది కూడా చూడండి: Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్..  ఆ నెయ్యి తింటే అంతే.. షాకింగ్ వీడియో!

గంధపు నూనె
ఈ నూనె కాస్త జిడ్డుగా ఉంటుంది. కానీ తలకు అప్లై చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు జుట్టు రాలిపోకుండా చేస్తాయి. అలాగే దురద, చుండ్రు, జిగట సమస్యలను కూడా తగ్గిస్తాయి. అయితే ఈ గంధపు నూనెలో కొబ్బరి లేదా గంధపు మిక్స్ చేసి రాయాలి. 

ఇది కూడా చూడండి: Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ, చంద్రబాబు, రేవంత్- PHOTOS

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు