Air Pollution: వాయు కాలుష్యంతో కూడా మధుమేహం వస్తుందా? చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వలన మధుమేహం వేగంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కాలుష్యం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా దెబ్బతీయటంతోపాటు మధుమేహ కొన్ని అధ్యయనాల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Air Pollution షేర్ చేయండి Air Pollution: ఢిల్లీతో పాటు పలు పరిసర ప్రాంతాల్లో కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయిలో ఉంది. AQI 400 కంటే ఎక్కువగా నమోదవుతోంది. కాలుష్యం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి. కానీ కాలుష్యం వల్ల మధుమేహం కూడా వస్తుందని అంటున్నారు నిపుణులు. దీనిపై ఓ పరిశోధన కూడా చేశారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉంది. కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆస్పత్రుల్లోని ఓపీడీలో శ్వాసకోశ రోగుల రద్దీ నెలకొంది. పెరుగుతున్న కాలుష్యం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా దెబ్బతీస్తుంది. ఇది ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. చెడు గాలి కారణంగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతాయని వైద్యులు అంటున్నారు. ఇది కూడా చదవండి: Heart Healthy: చలికాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పని చేయండి వ్యాధికి ప్రధాన కారణం: అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే కాలుష్యం కారణంగా ప్రజలు మధుమేహ బాధితులుగా కూడా మారవచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మధుమేహం అనేది జీవనశైలికి సంబంధించదిన వ్యాధి. ఇది శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు సంభవిస్తుంది. ICMR ప్రకారం భారతదేశంలో 10 కోట్ల మందికిపైగా ఈ వ్యాధి ఉన్న రోగులు ఉన్నారు. ఈ వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. జన్యుపరమైన కారణాల వల్ల రెండు రకాల మధుమేహాలు వస్తాయి. చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వలన కలుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో మధుమేహం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యాధి చిన్న వయసులోనే వస్తోంది. ఊబకాయం పెరగడం కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. థెరప్యూటిక్ అడ్వాన్సెస్ ఇన్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ప్రచురించిన ఒక అధ్యయనంలో వాయు కాలుష్యంతో మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. ఇది కూడా చదవండి: జ్ఙాపకశక్తిని 10 రెట్లు పెంచే అద్భుతమైన ఆహారాలు పర్టిక్యులేట్ మ్యాటర్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇవి రక్తంలో కలిసిపోతాయని, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుందని, దీంతో శరీరం చక్కెర స్థాయిని నియంత్రించడం కష్టతరం చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇది టైప్-2 మధుమేహం ముప్పును పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. కాలుష్యంలో ఉన్న PM 2.5 కణాలు ఊపిరితిత్తులలోకి వెళ్లి అక్కడ స్థిరపడతాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుందని వైద్యులు అంటున్నారు. కాలుష్యంలోని కర్బన సమ్మేళనాలు రక్తంలో కరిగిపోవడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతను కూడా కలిగిస్తాయని, ఇది కూడా షుగర్ లెవెల్ పెరగడానికి కారణం కావచ్చని చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: జీవితాంతం కళ్లు మూసుకోని జీవి ఏదో తెలుసా? ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టుల రివేంజ్.. ఇన్ఫార్మర్లను గొడ్డలితో నరికి చంపి..! #diabetes #air pollution and diabetes #impact of air pollution on health #air-pollution మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి