Stomach Problems : ఆరోగ్యంగా(Healthy) ఉండాలంటే పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. చేతులు శుభ్రం చేయకుండా తినడం, మురికి నీరు తాగడం ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే కొన్ని సార్లు అపరిశుభ్రత కడుపులో నులిపురుగుల సమస్య(Worm Problem) కు కారణమవుతుంది. పేగులలో పురుగులు రావడం ఆరోగ్యాన్ని వేగంగా దెబ్బతీస్తాయి. మీ పేగుల్లో పురుగులు ఉన్నాయని, తెలిపే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..
కడుపులో నులిపురుగుల లక్షణాలు
- కడుపులో నులిపురుగుల ఉన్నవారు.. కడుపులో నొప్పి, తిమ్మిరిని అనుభవిస్తారు.
- పేగుల్లోని పురుగులు ఉన్నవారికి విరేచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలు ఉంటాయి.
- ఏదైనా తింటే కడుపులో గ్యాస్ ఏర్పడి కడుపు నొప్పి మొదలవుతుంది.
- ఇది కాకుండా, మూత్రం, మలం ప్రాంతంలో దురద సమస్య కూడా ఉంటుంది.
- ఎల్లప్పుడూ అలసిపోయినట్లుగా, నీరసంగా అనిపిస్తుంది.
కడుపులో పురుగులు రావడానికి కారణాలు
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం , కడుపులో నులిపురుగులు ప్రధానంగా 3 కారణాల వల్ల వస్తాయి. ఇంఫెక్టెడ్ వాటర్ తాగడం(Drinking Infected Water) లేదా వాటిని ఆహార పదార్థాలు శుభ్రపరచడానికి ఉపయోగించడం. మరొకటి పూర్తిగా ఉండకని ఆహరం తీసుకోవడం. పిల్లలో తరచు నోట్లో వేళ్ళు పెట్టుకోవడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. ఇంఫెక్టెడ్ ఏరియాలో చెప్పులు లేకుండా నడవడం వంటివి కడుపులో నులిపురుగులకు కారణమవుతాయి.
కడుపులో నులిపురుగులు ఉంటే ఎందుకు ప్రమాదం?
రోగ నిరోధక శక్తి(Immunity Power) తగ్గి, పోషకాహార లోపం, ఐరన్ లోపం, కడుపు సమస్యలు తలెత్తుతాయి. అంతే కాదు, టేప్ వార్మ్ పొట్టలో ఎక్కువసేపు ఉండిపోయినట్లయితే, అది మెదడు, కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు లేదా కాలేయంలోకి వెళ్లి ఈ అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
కావున వైద్యుల సలహా మేరకు ఎప్పటికప్పుడు నులిపురుగుల నిర్మూలన చేయించుకోవాలి. ఇది మాత్రమే కాదు, పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి, కడుపులో నులిపురుగులను తొలగించడంలో సహాయపడే ఆహారాలను మీ డైట్ లో చేర్చండి.