Hyderabad: ఆ దుర్మార్గులు చచ్చేదాకా జైలులోనే.. కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు

2018లో 8 నెలల గర్భిణిని అత్యంత దారుణంగా చంపి ఎనిమిది ముక్కలు చేసిన కేసులో నలుగురు నిందితులకు కూకట్‌పల్లి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 65 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. డీఎన్‌ఏ, ఇతర ఆధారాలతో తుది తీర్పు వెల్లడించింది.

New Update
Hyderabad: ఆ దుర్మార్గులు చచ్చేదాకా జైలులోనే.. కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు

Hyderabad Crime : ఐదేళ్ల క్రితం నిండు గర్భిణిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో తుది తీర్పు వెలువడింది. కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో జరిగిన ఈ ఇష్యూపై శుక్రవారం తుది విచారణ చేపట్టిన కూకట్‌పల్లి సెషన్స్ కోర్టు (kukatpally) నిందితులకు జీవిత ఖైదు విధించింది. మొత్తం 65 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. డీఎన్‌ఏ (DNA) నివేదిక, ఇతర ఆధారాలతో తీర్పు వెల్లడించిది.

అసలేం జరిగింది..
బిహార్‌కు చెందిన బింగి అలియాస్‌ పింకీకి దినేశ్‌తో 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అయితే పింకీ అదే ప్రాంతానికి చెందిన వికాస్‌ కశ్యప్‌ (32)తో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. అప్పటికే వికాస్‌కు మమతా ఝా (36)అనే మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగుతోంది. అయితే మమతాఝాకు భర్త అనిల్ ‌ఝా (60), కుమారుడు అమర్‌కాంత్‌ ఝా (24)ఉన్నారు. ఈ క్రమంలోనే వికాస్‌కు మమతతో సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న పింకీ.. ఒక రోజు ప్రియుడు వికాస్‌ను వెతుక్కుంటూ తన చిన్న కుమారుడితో కలిసి సిద్దిఖ్‌నగర్‌కు వచ్చి నిలదీసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర గొడవలు మొదలయ్యాయి.

ఇది కూడా చదవండి : Dharani Portal: ధరణి పోర్టల్‌పై మీ వైఖరేంటి? కాంగ్రెస్‌ ను ప్రశ్నించిన హైకోర్టు

8 ముక్కలుగా నరికి..
ఈ నేపథ్యంలోనే 2018 జనవరి 27న రాత్రి 12 గంటల ప్రాంతంలో పింకీ (బింగి)పై వికాస్‌, మమత, అమర్‌కాంత్‌, అనిల్‌ దాడి చేశారు. గర్భిణి అని చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశారు. స్టోన్‌ కట్టర్‌తో మృతదేహాన్ని 8 ముక్కలుగా చేసి గోనె సంచిలో వేసి బొటానికల్‌ గార్డెన్‌ను ఆనుకుని ఉన్న శ్రీరాంనగర్‌ కాలనీ ప్రధాన రోడ్డు మీద పడేసి వెళ్లిపోయారు.

సంచి నుంచి వాసన రావడంతో..
అయితే జనవరి 30న ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న స్థానికులు.. సంచి నుంచి దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి ద్విచక్రవాహనం నంబరు ఆధారంగా అమర్‌కాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా శుక్రవారం కూకట్‌పల్లి కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు