Maldives : ఇంకోసారి ఈ తప్పు జరగకుండా చూస్తాం : మాల్దీవుల మంత్రి!

మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ భారత్‌ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదని మేం స్పష్టం చేశాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అలాగే అలాంటి వైఖరి పునరావృతం కాకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Maldives : ఇంకోసారి ఈ తప్పు జరగకుండా చూస్తాం : మాల్దీవుల మంత్రి!
New Update

Maldives Minister : మాల్దీవులు-భారత్(Maldives-India) మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. కొంతకాలం కిందట భారత ప్రధాని మోడీ(PM Modi) లక్షద్వీప్‌ పర్యటన చేసిన. ఫొటోలను సోషల్‌ మీడియా(Social Media) లో పంచుకున్న నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ తర్వాత నుంచి రెండుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి జరగకుండా చూస్తామని ఆ దేశ విదేశాంగమంత్రి మూసా జమీర్‌ హామీ ఇచ్చారు.

మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ మనదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదని మేం స్పష్టం చేశాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అలాగే అలాంటి వైఖరి పునరావృతం కాకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయంలో అపార్థాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఆ దశను దాటేశాం. భారత్‌-మాల్దీవుల ప్రభుత్వాలు జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాయి’’ అని వెల్లడించారు.

పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతవుతాయి స్పష్టం చేశారు.ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు తీసుకున్న భారత వ్యతిరేక నిర్ణయాలు కూడా ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ఈ సమయంలోనే జమీర్‌ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మన విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని ఈ సమావేశంలో జైశంకర్ స్పష్టం చేశారు.

Also read: ప్రారంభమైన పవిత్ర చార్ ధామ్ యాత్ర.. తెరుచుకున్న ఆలయాలు.. 

#tourism #minister #india #maldives
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe