EC: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి...వచ్చే సారికి మొదలు పెట్టండి...ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు!

ఈవీఎంలపై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేయాల్సిన సమయంలో పుట్టినట్లు ఉన్నాయి, కానీ అవి చాలా నమ్మకమైనవి’’ అని.. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఈవీఎంలను తిట్టడానికి సిద్ధంగా ఉన్నందున ప్రస్తుతం వాటికి విశ్రాంతి ఇవ్వాలని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ అన్నారు.

New Update
EC: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి...వచ్చే సారికి మొదలు పెట్టండి...ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు!

Election Commission On EVM Tampering: ఈసారి ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ ల పని తీరు గురించి విపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేస్తున్నారంటూ...కాంగ్రెస్‌ తో పాటు ఇండియా కూటమి నేతలు కూడా చాలా సార్లు ఆరోపణలు ఓ రేంజ్‌ లో చేస్తున్న విషయం తెలిసిందే. తీరా ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రతిపక్షాలన్ని కూడా సైలెంట్‌ అయిపోయాయి.

జూన్ 4 ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల పనితీరును తప్పుబడుతూ ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.అయితే, ఈవీఎంలను పనితీరును తప్పుబడుతూ ప్రతిపక్షాలు తిట్టడాన్ని ఉద్దేశిస్తూ సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘బహుశా ఈవీఎంలపై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేయాల్సిన సమయంలో పుట్టినట్లు ఉన్నాయి, కానీ అవి చాలా నమ్మకమైనవి’’ అని అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఈవీఎంలను తిట్టడానికి సిద్ధంగా ఉన్నందున ప్రస్తుతం వాటికి విశ్రాంతి ఇవ్వాలని అన్నారు.

గత ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్‌కి గురవుతున్నాయని, వాటి విశ్వసనీయతను ఎప్పుడూ ప్రశ్నార్థకంగా ఎత్తి చూపేవారని, కానీ చివరకు ఎల్లప్పుడు అవి ఫలితాలను చూపించాయని అన్నారు.

Also Read: రాళ్లు, కోడి గుడ్లతో కొడాలి నానిపై దాడి

Advertisment
తాజా కథనాలు