Nizamabad district: చిక్కిన చిరుత.. ఈ సారి ఎక్కడంటే.! ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చిరుతల సంచారం అధికమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల పరిధిలోని యంచ గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు చిరుతును బంధించేందుకు రంగంలోకి దిగారు. By Karthik 09 Sep 2023 in Latest News In Telugu నిజామాబాద్ New Update షేర్ చేయండి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చిరుతల సంచారం అధికమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల పరిధిలోని యంచ గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు చిరుతును బంధించేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా యంచ గ్రామ శివారులో బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో చిరుత ఇవాళ ఉదయం బోనులో పడ్డట్లు అధికారులు తెలిపారు. చిరుత పులిని అధికారులు బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత మూడు రోజుల క్రితం చిరుత సంచరిస్తుండటాన్ని పశువుల కాపర్లు గుర్తించారు. పశువులను చిరుత చంపినట్లు అధికారులకు తెలిపారు. Your browser does not support the video tag. దీంతో మూడు రోజుల నుంచి యంచ గ్రామస్తులు చిరుత ఎక్కడి నుంచి వస్తుందో తెలియక భయం గుప్పిట్లో బిక్కు బిక్కు మంటూ గడిపారు. రైతులు ఉదయం పొలాల్లోకి వెళ్లాలన్నా భయాందోళన వ్యక్తం చేసేవారు. సాయంత్రం 5 దాటితే చాలు పిల్లలు పెద్దలు ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇటీవల తిరుమలలో చిరుతల సంచారం అధికంగా ఉందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అలిపిరి మార్గంలో దాదాపు పదుల సంఖ్యలో చిరుతలు సంచరిస్తున్నట్లు వారు తెలిపారు చిరుతలు సంచరిస్తున్న ప్రాంతాల్లో టీటీడీ రక్షణ చర్యలు చేపట్టింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం చిరుత సంచరిస్తున్నట్లు గతంలో అనేక మంది తెలిపారు. కానీ అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో గ్రామస్తులు వేరే జంతువును చూసి చిరుత అనుకోని ఉండొచ్చని గతంలో అధికారులు భావించారు. కానీ ప్రస్తుతం చిరుతల సంచారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బోనులో పడ్డవి కొన్నేనని దొరకని చిరుతలు ఇంకెన్ని ఉన్నాయే అని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. #nizamabad #cheetah #people #yancha #cattle #panic మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి