Susheela: లెజండరీ సింగర్‌ సుశీలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

లెజండరీ సింగర్ పి. సుశీల అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుశీల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

New Update
Susheela: లెజండరీ సింగర్‌ సుశీలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

లెజండరీ సింగర్, పద్మభూషన్ గ్రహీత పి. సుశీల అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. 86 ఏళ్ల వయసున్న సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. సుశీల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Also Read: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు

మందులతో ఆమెకు కడుపు నొప్పి తగ్గిపోతుందని పేర్కొన్నారు. సుశీల త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలాఉండగా.. సుశీల ఎన్నో అద్భుత గీతాలను ఆలపించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మొత్తం 9 భాషాల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. సావిత్రి, పద్మిని, సరోజాదేవి వంటి దిగ్గజ నటీమణులకు పాటలకు పాడారు. ఉష్రేష్ మన్మాన్ సినిమాలోని లైక్‌ పాల్ అనే పాటకు ఆమె తొలిసారిగా ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు.

Also Read: గుడ్‌న్యూస్.. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం\

Advertisment
తాజా కథనాలు